Rahul Gandhi : రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్న స్థానానికి నేడు ఎన్నికలు...లోక్​ సభ రెండో దశ పోలింగ్ ఈరోజే!

లోక్‌ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ శుక్రవారం ఏప్రిల్‌ 26న జరగనుంది. ఈ సారి ఎన్నికలు మొత్తంగా 13 రాష్ట్రాల్లోని 88 ఎంపీ స్థానాలకు నిర్వహించనున్నారు. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తారు.

New Update
Rahul Gandhi : ఎన్నో భావోద్వేగాల మధ్య వాయనాడ్‌ను వీడుతున్నా..!

Elections : లోక్‌ సభ ఎన్నికల(Lok Sabha Elections) రెండో దశ పోలింగ్‌ శుక్రవారం ఏప్రిల్‌ 26న జరగనుంది. ఈ సారి ఎన్నికలు మొత్తంగా 13 రాష్ట్రాల్లోని 88 ఎంపీ స్థానాలకు నిర్వహించనున్నారు. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తారు. ఈ సారి 16 లక్షలకు పైగా సిబ్బందితో అన్ని ఏర్పాట్లను చేసినట్లు ఎన్నికల అధికారులు వివరించారు.

నిజానికి రెండో దశలో 89 స్థానాలకు పోలింగ్‌ జరగాల్సి ఉంది. కానీ మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) లోని బైతూల్‌ లోక్ సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి మృతి చెందడంతో అక్కడ పోలింగ్ ను ఎన్నికల కమిషన్‌(Election Commission) మే 7వ తేదీకి వాయిదా వేసింది.

రాహుల్ పోటీ చేస్తున్న చోటా ఈరోజే

రెండో విడతలో భాగంగా కేరళలోని మొత్తం 20 స్థానాలకు శుక్రవారమే పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇందులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పోటీ చేస్తున్న వయనాడ్ సీటు కూడా ఉంది. ఇంకా ఇతర ప్రముఖులను చూస్తే.. కాంగ్రెస్(Congress) సీనియర్ నేత శశిథరూర్ తిరువనంతపురంలో పోటీ పడుతున్నారు. ఆ స్థానానికి ఈరోజే ఎన్నికలు.

కర్ణాటకలోని బెంగళూరు సౌత్‌ స్థానంలో బీజేపీ నేత తేజస్వీ సూర్య, ఉత్తరప్రదేశ్‌ లో సినీ నటి హేమామాలిని, ‘టీవీ రాముడు’ అరుణ్‌ గోవిల్‌ తదితరులు ఈ దశలో పోటీ చేస్తున్నారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేశ్‌ భఘేల్‌ కూడా ఈ రెండో దశలోనే బరిలో ఉన్నారు.

Also read: మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు