Akshaya Tritiya Gold Offers : అక్షయ తృతీయ అనగానే మనకు గుర్తుకు వచ్చేది బంగారం కొనుగోళ్లు. ఈ పండుగ రోజు బంగారం కొంటే సిరిసంపదలు వస్తాయని చాలా మంది విశ్వసిస్తుంటారు. అందుకే కచ్చితంగా ఎంతో కొంత పసిడిని కొనుగోలు చేస్తుంటారు. ఈ కారణంగానే ఆరోజు దేశవ్యాప్తంగా బంగారం దుకాణాలు కిటకిటలాడుతాయి.వినియోగదారుల ఆసక్తిని గుర్తించి పలు సంస్థలు బంగారం కొనుగోళ్లలో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్ యూ టర్న్
దీనికి తోడు ఫోన్ ఫే, పేటీఎం వంటి యాప్స్ కూడా ఆఫర్లను ప్రవేశపెట్టాయి.ఫోన్ పేలో 24 క్యారెట్ల బంగారం కొంటే క్యాష్ బ్యాక్, క్యారట్ లేన్ స్టోర్లలో రీడీమ్ చేసుకుంటే డిస్కౌంట్లు పొందవచ్చు. పేటీఎంలో గోల్డెన్ రష్ ఆఫర్ కింద రివార్డ్ పాయింట్లు గెలుచుకోవచ్చు. అంతేకాదు, లీడర్‌బోర్డ్‌లో టాప్ ప్లేస్ లో ఉంటే 100 గ్రాముల పూల్ నుంచి బంగారం గెలుచుకునే అవకాశం కూడా ఉంది.
ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్!
అసలే డిజిటల్ యుగం అందులోనూ షాపింగ్ చేసేంత సమయం లేని ఒత్తిడి. అందుకే డిజిటల్ యుగంలో ట్రెండ్ మారింది. మొబైల్ ఫోన్ ఉంటే చాలు. దానినుంచే బంగారాన్ని కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. ఇక అక్షయ తృతీయ సందర్బంగా ఏప్రిల్ 30న వినియోగదారులను ఆకర్షించేందుకు ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్ అదిరిపోయే క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్లను కూడా ప్రకటించాయి. ప్రోత్సహకాలు కూడా అందిస్తున్నాయి.
ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం
ఫోన్ పే ఆఫర్లు
ఏప్రిల్ 30న అక్షయ తృతీయ రోజు ఫోన్ పే లో 24 క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేస్తే 1 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అయితే వినియోగదారులు కనీసం రూ. 2,000 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలు చేయాలి. గరిష్టంగా రూ. 2,000 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చని సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30న మాత్రమే ఉంటుంది. ఒక్క లావాదేవీకి మాత్రమే క్యాష్ బ్యాక్ లభిస్తుంది. SIP ఆధారిత కొనుగోళ్లకు ఆఫర్ లేదు. ఏప్రిల్ 30న రాత్రి 11:59 గంటల వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
ఇక ఫోన్ పే కస్టమర్లు తమ గోల్డ్ ను క్యారట్ లేన్ స్టోర్లు లేదా వెబ్ సైట్లో రీడీమ్ చేస్తే ఈ కింది డిస్కౌంట్లు లభిస్తాయి.గోల్డ్ కాయిన్‌లపై 2 శాతం డిస్కౌంట్, అన్ స్టడెడ్ జ్యువెలరీపై 3 శాతం డిస్కౌంట్
స్టడెడ్ జ్యువెలరీపై 5 శాతం డిస్కౌంట్ కాగా, ఫోన్ పే లో ఎస్ఐపీ ద్వారా కనీసం రూ. 5 తో కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
Also Read : ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!
పేటీఎం ఆఫర్లు
డిజిటల్ గోల్డ్ సేవింగ్స్‌ను ప్రోత్సహించడానికి పేటీఎం 'గోల్డెన్ రష్' క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్లో భాగంగా, పేటీఎం గోల్డ్ లో రూ. 500 లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే వినియోగదారులు లావాదేవీ విలువలో 5 శాతాన్ని రివార్డ్ పాయింట్లుగా పొందుతారు. ఇవి వారిని ఒక లీడర్‌బోర్డ్‌లో నిలుపుతాయి. లీడర్‌బోర్డ్‌లో టాప్ యూజర్లు మొత్తం 100 గ్రాముల గోల్డ్ ప్రైజ్ పూల్ నుంచి పసిడి గెలుచుకోవచ్చు. కాగా, పేటీఎం లో ఎస్ఐపీ ద్వారా రూ. 9 తో కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
Also Read : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్
వీటికి తోడు పలు బంగారు షాపులు సైతం ఆఫర్లు ప్రకటించాయి.లక్షకు చేరువలో పుత్తడి కదలాడుతుండటంతో కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ఆభరణ విక్రయ సంస్థలు అన్ని విధాలుగా ప్రయత్నాలను ప్రారంభించాయి. ఈ నెల 30న అక్షయ తృతీయ ఉండటంతో రిటైల్ దిగ్గజాలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. తనిష్క్, మలబార్ గోల్డ్, రిలయన్స్, క్యారట్‌లైన్, కల్యాణ్‌జ్యూవెల్లర్స్ వంటి దిగ్గజాలు ఈ ఆఫర్ల పట్టికలో ఉన్నాయి.
Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!
కల్యాణ్ జ్యూవెల్లర్స్..
అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ జ్యూవెల్లరీ తయారీపై విధించే చార్జీలను 50 శాతం వరకు కోత పెట్టింది. ఇందుకోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే మొత్తం కొనుగోలులో నాలుగోవంతు ముందస్తుగానే చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
తనిష్క్ అభరణాలు
టాటా గ్రూపునకు చెందిన ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్..అక్షయ తృతీయ సందర్భంగా ఆభరణాలపై ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 30 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద గోల్డ్ లేదా డైమండ్ ఆభరణాల తయారీపై చార్జీలను 20 శాతం వరకు తగ్గింపు కల్పిస్తున్నది.
రిలయన్స్ జ్యూవెల్స్..
రిలయన్స్ జ్యూవెల్స్ కూడా ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. బంగా రు ఆభరణాల తయారీపై 25 శాతం వరకు తగ్గింపు కల్పించిన సంస్థ..డైమండ్ జ్యూవెల్లరీపై 30 శాతం తగ్గింపునిచ్చింది. దీంతోపాటు పాత గోల్డ్‌పై 100 శాతం ఎక్సేంజ్ కూడా అందిస్తున్నది. ఈ ఆఫర్ వచ్చే నెల 5 వరకు అందుబాటులో ఉండనున్నది.
ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!
క్యారట్‌లేన్
కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి క్యారెట్‌లైన్ ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. రూ.15 వేల నుంచి రూ.30 వేల లోపు బంగారాన్ని కొనుగోలు చేసిన వారికి 10 గ్రాముల వెండి నాణేన్ని, రూ.30 వేల నుంచి రూ.60 వేల లోపు బంగారంపై అరగ్రాము బంగారం నాణేన్ని, రూ.60 వేల నుంచి రూ.90 వేల లోపు కొనుగోళ్లపై అరగ్రాము గోల్డ్ కాయిన్ అందిస్తున్నట్టు ప్రకటించింది.
మలబార్ గోల్డ్..
మలబార్ గోల్డ్ కూడా గోల్డ్, డైమండ్ల ఆభరణాల తయారీపై విధించే చార్జీలను 25 శాతం వరకు డిస్కౌంట్‌ను ఇస్తున్నది.
Also Read: ఏపీలో పాకిస్తాన్ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!