Telangana BJP: లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణలో బీజేపీకి షాక్! BRS ఎంపీ బీబీ పాటిల్‌ను పార్టీలో చేర్చుకోవడం బీజేపీకి తలనొప్పిగా మారింది. పాటిల్ చేరికను జహీరాబాద్ బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం ఎదుట ఆందోళన చెప్పట్టారు. పాటిల్‌కు ఎంపీ టికెట్ ఇస్తే బీజేపీ మూడో స్థానానికి పడిపోతుందని వాపోతున్నారు. By V.J Reddy 02 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana BJP: లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 16 స్థానాల్లో విజయమే టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీకి కొత్త సమస్య వచ్చి చేరింది. ఎంపీ ఎన్నికల్లో పోటీకి దింపే అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది బీజేపీ హైకమాండ్. ఇతర పార్టీల నుంచి నేతలను తమ పార్టీలో చేర్చుకుంటూ బలం చేకూర్చుకుంటుంది. ఈ క్రమంలో నిన్న (శుక్రవారం) బీజేపీ నేత తరుణ్ చూజ్ ఆధ్వర్యంలో జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కాషాయ జెండా కప్పుకున్నారు. తన రాజీనామా లేఖను మాజీ సీఎం కేసీఆర్ కు పంపారు. ALSO READ: మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్ మాకు వద్దు సార్.. బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ను పార్టీలో చేర్చుకోవడం బీజేపీకి ఇప్పుడు తలనొప్పిగా మారింది. పాటిల్ ను బీజేపీలో చేర్చుకోవద్దంటూ జహీరాబాద్ బీజేపీ నేతలు హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎదుట ఆందోళనకు దిగారు. ఫెయిల్యూర్ ఎంపీ మాకొద్దు అంటూ నినాదాలు చేపట్టారు. అతనికి ఎంపీ టికెట్ ఇస్తే బీజేపీ మూడో స్థానంలో పడిపోతుందని వారు ఆందోళన చేపట్టారు. బీబీ పాటిల్ కాకుండా జహీరాబాద్ లో పార్టీని బలోపేతం చేసిన జైపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిరసనకారులను ఎమ్మెల్యే క్వాటర్స్ కు రమ్మని కిషన్ రెడ్డి పిలవడంతో వారు సమ్మె విరమించారు. ఎంపీ హామీతోనే చేరిన బీబీ పాటిల్.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్.. ఎంపీ టికెట్ హామీతోనే బీజేపీలో చేరారని ప్రచారం జోరందుకుంది. అయితే.. ఆయన చేరికతో జహీరాబాద్ లో బీజేపీకి బలం చేకూరుతుందని భావించిన బీజేపీ.. ఆయనకే ఎంపీ టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బీబీ పాటిల్ చేరికను జహీరాబాద్ బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బీబీ పాటిల్ కు టికెట్ ఇద్దామా? లేదా? ఆలోచనలు బీజేపీ అధిష్టానం ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. #kishan-reddy #telangana-bjp #zaheerabad #bb-patil మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి