Subsidy On Fertilizers: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మోడీ సర్కార్

పెరిగిన ఎరువుల ధరలతో ఇబ్బంది పడుతున్న రైతులకు మోడీ సర్కార్ తీపి కబురు అందించింది. ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రి వర్గం భేటీలో ఖరీఫ్ సీజన్‌లో ఎరువులపై సబ్సిడీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులకు కొంత ఉపశమనం లభించనుంది.

New Update
PM Kisan Update : రైతులకు అలెర్ట్.. పీఎం కిసాన్‌ 17వ నిధుల విడుదలపై కీలక్‌ అప్‌డేట్‌!

Subsidy On Fertilizers: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రజలను ఆకట్టుకునే విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పథకాలను రూపొందిస్తోంది. ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో బీజేపీ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పెరిగిన ఎరువుల ధరలతో సతమతమవుతున్న రైతులకు తీపి కబురు అందించింది. ఖరీఫ్ సీజన్ లో ఎరువులపై సబ్సిడీ పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎన్‌బీఎస్‌ స్కీం కింద రైతులు పంటల్లో ఎక్కువగా వాడే పొటాషియం, ఫాస్ఫాటిక్ ఎరువులతో పాటు మరో మూడు రకాల ఎరువులపై సబ్సిడీని పెంచింది. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 24,420 కోట్లను కేటాయించింది. ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు ఎరువుల రాయితీని అందించనున్నట్లు మోడీ సర్కార్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం మొత్తం 25 రకాల పొటాషియం, ఫాస్ఫాటిక్ ఎరువులపై సబ్సిడీని అందిస్తున్న విషయం తెలిసిందే.

ఓట్ల కోసమేనా?..

రానున్న లోక్ సభ ఎన్నికల్లో 370 స్థానాల్లో విజయం సాధిస్తామని.. ఎన్డీయే కూటమి తో కలిపి మొత్తం 400 స్థానాల్లో విజయం సాధిస్తామని ప్రచారంలో ధీమా వ్యక్తం చేస్తోంది కాషాయ దళం. ఈ క్రమంలో ప్రజల నుంచి ఓట్ల కొల్లగొట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. దేశంలో రైతు ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉండడంతో వారిని ఆకట్టుకునే దిశగా ప్లాన్స్ వేస్తోంది బీజేపీ. ఇందుకోసం లోక్ సభ ఎన్నికలకు ముందుగానే ఎరువులపై సబ్సిడీ, పీఎం కిసాన్ నిధులను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాలో జమ చేసే ప్రక్రియను మొదలు పెట్టింది. తాజాగా ఎరువులపై సబ్సిడీ ప్రకటించడంతో రైతుల ఓట్లు తమ ఖాతాలో పడుతాయని బీజేపీ భావిస్తోంది. ఈ పథకం తో బీజేపీకి రైతుల నుంచి ఓట్లు పడుతాయి లేదా అనేది ఎన్నికల ఫలితాల తరువాతే తేలనుంది.

Also Read: ఇంటింటికి ఫ్రీ కరెంట్ పథకం..దరఖాస్తులు షురూ..ఇలా అప్లయ్ చేసుకోండి.!

Advertisment
Advertisment
తాజా కథనాలు