MLA KTR: సీఎం రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్

సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు కేటీఆర్. తెలంగాణలో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయి రైతు ఇబ్బందులు పడుతుంటే.. పట్టించుకోకుండా ఓట్లు సీట్ల కోసం ఢిల్లీ చుట్టూ రేవంత్ తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు. వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

New Update
MLA KTR: సీఎం రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్

MLA KTR Comments On CM Revanth Reddy: గత రెండు రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాలలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా చేత్తుకొచ్చే పంట నీట మునిగి రైతులకు తీవ్ర నష్టాన్ని తెచ్చి పెట్టింది. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతలు.. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని (Congress Govt) డిమాండ్ చేస్తున్నారు. తాజాగా అకాల వర్షాల (Rains) వల్ల పంట నష్టపోయిన రైతుల తరఫున మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు.

ట్విట్టర్ (X) వేదికగా సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. కేటీఆర్ ట్విట్టర్ లో.. " ముఖ్యమంత్రి గారు.. రైతులంటే.. మీకు ఎందుకింత చిన్నచూపు..?, నిన్న.. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు.. నేడు.. వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటంలేదు.. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా...?, అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా..??, ఎన్నికల గోల తప్ప.. ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా..?, సీట్లు.. ఓట్ల.. పంచాయతీ తప్ప.. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా..??, ప్రజా పాలన అంటే.. 24/7 ఫక్తు రాజకీయమేనా..?" అని నిలదీశారు.

"పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంటనష్టంపై లేదెందుకు ??, పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా ?, హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ.. రైతుల సమస్యలు వినే ఓపిక లేదా ?, ఇంతకాలం.. పచ్చని పైర్లు ఎండుతున్నా.. సాగునీరు ఇవ్వడం చేతకాలేదు..!, ఇప్పుడు.. నష్టపోయిన పంటలకు.. పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదా..?, గుర్తు పెట్టుకోండి..!!, ఎద్దేడ్సిన ఎవుసం..! రైతేడ్సిన “రాజ్యం బాగుండదు ..” !!, అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై.. భారత “రైతు” సమితి.. పోరాడుతూనే ఉంటది..!!! , జై కిసాన్.. జై తెలంగాణ" అంటూ రాసుకొచ్చారు.

Also Read: అసదుద్దీన్ ఓవైసీ పెద్ద దొంగ.. మంత్రి కోమటిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

Advertisment
Advertisment
తాజా కథనాలు