Mallareddy: కేసీఆర్ వల్లే సాధ్యమైంది.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్‌గా నిలిపిన ఘనత కేసీఆర్ దే.. అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం అయిందని అన్నారు మల్లారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 100 రోజులైనా ప్రజలకు ఇచ్చిన హామీలలో నెరవేర్చింది శూన్యం అని విమర్శించారు.

New Update
Mallareddy: కేసీఆర్ వల్లే సాధ్యమైంది.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Mallareddy: మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపిన ఘనత కేసీఆర్ దే.. అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం అయిందని అన్నారు. మల్కాజ్ గిరి పార్లమెంటులోని ఏడు శాసనసభ నియోజకవర్గాలలో మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల మేయర్లు, నాయకులు పాల్గొని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ ను అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలిపి దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత మేయర్, పాలకవర్గానికే దక్కుతుందన్నారు.

ALSO READ: వెంటనే విడుదల చేయాలి.. కవిత, కేజ్రీవాల్ అరెస్ట్‌పై కేసీఆర్ ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 100 రోజులైనా ప్రజలకు ఇచ్చిన హామీలలో నెరవేర్చింది శూన్యం.. కూల్చడంలో నెంబర్ వన్ ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం అయినటువంటి మల్కాజ్ గిరి పార్లమెంట్ కు బిఅర్ఎస్ పార్టీ ఎంపి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాగిడి లక్ష్మారెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.... నా రాజకీయ జీవితంలో అనేక సేవా కార్యక్రమాలు చేశానని నా సేవా దృక్పథం, నిబద్దతను చూసి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ నాకు ఎంపి ఆభ్యర్ధిగా అవకాశం కల్పించారు అన్నారు. మల్కాజ్ గిరి ఎంపీగా భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తే నియోజకవర్గంతో పాటు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండని అభ్యర్థులకు ఓటు వేయవద్దని, ఢిల్లీ పార్టీలను వదిలి.. తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్ కు అండగా నిలవాలని ఓడించడానికి పార్టీ శ్రేణులు ఒక్కటిగా కృషి చేయలని పిలుపిచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు