MLA KTR: సీఎం రేవంత్‌తో పాటు బీజేపీలోకి ఆ కీలక నేత.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. లోక్ సభ ఎన్నికల తరువాత సీఎం రేవంత్ రెడ్డితో పాటు సౌత్ ఇండియా నుంచి ఒక కీలక నేత బీజేపీలో చేరుతారని అన్నారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపుతున్నాయి.

New Update
MLA KTR: సీఎం రేవంత్‌తో పాటు బీజేపీలోకి ఆ కీలక నేత.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth To Join BJP - MLA KTR: సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల తరువాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని అన్నారు. ఇదే విషయాన్ని తాను 15 సార్లు ప్రస్తావించానని.. ప్రపంచంలో జరిగే చిన్న విషయాలకు స్పందించే రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. బీజేపీలో చేరుతారని జరుగుతున్న ప్రచారంపై ఇప్పటికి వరకు ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల తరువాత సీఎం రేవంత్ రెడ్డితో పాటు సౌత్ ఇండియా నుంచి ఒక కీలక నేత బీజేపీలో చేరుతారని అన్నారు. ప్రస్తుతం కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కుంపటి పెట్టినట్లు అయింది.

ఆ కీలక నేత ఎవరు?

త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు దక్షిణాది రాష్ట్రం నుంచి మరో కీలక నేత బీజేపీలో (BJP) చేరబితున్నారని మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాలతో దక్షిణాది రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. సీఎం రేవంత్ తో వెళ్లే ఆ కీలక నేత ఎవరు అంటూ అటు నేతలు.. ఇటు ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమారే ఆ కీలక నేత అంటూ పుకార్లు పుట్టుకొస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం కర్ణాటక రాష్ట్రానికి సీఎం అవ్వాలని డీకే శివకుమార్ ఆశపడగా.. ఆయనకు కాకుండా సిద్ధరామయ్యను కర్ణాటక రాష్ట్రానికి సీఎం చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే.. తనను సీఎంను చేయనందుకు కాంగ్రెస్ హైకమాండ్ పై కోపం తో ఉన్నారని.. మరోవైపు తనపై ఉన్న ఈడీ, సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీలో చేరేందుకు ఆయన సిద్దమైనట్లు గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై స్పష్టత రావాలంటే లోక్ సభ ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

Also Read: బీఆర్ఎస్‌కు మరో షాక్‌.. బీజేపీలో మాజీ ఎమ్మెల్యే?

Advertisment
Advertisment
తాజా కథనాలు