IPS Transfers: తెలంగాణలో నలుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో అధికారుల బదిలీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

New Update
IPS Transfers: తెలంగాణలో నలుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ

IPS Officers Transfers in Telangana: తెలంగాణలో అధికారుల బదిలీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

* మహబూబాబాద్ ఎస్పీగా కే. సుధీర్ రామ్‌నాథ్‌.
* హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా అకాంక్ష్ యాదవ్‌.
* మంచిర్యాల డీసీపీగా అశోక్ కుమార్‌.
* ప్రస్తుత మహబూబాబాద్ ఎస్పీ పాటిల్ సంగ్రామ్ సింగ్ గణపతిరావును డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

ఇటీవల 8 మంది ఐఏఎస్ అధికారులు..

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి (CS Santhi Kumari) ఉత్తర్వులు జారీ చేశారు.

* సిద్దిపేట (Siddipet) జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ
* సిద్ధిపేట నూతన కలెక్టర్ గా కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరిని (Mikkilineni Manu Choudary) నియమించింది.
* వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్‌ బాషాను జనగాం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది.
* అలాగే వరంగల్ (Warangal) జిల్లా కలెక్టర్ శివలింగయ్యను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది.
* ప్రస్తుత పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శైలజా రామయ్యర్‌కు రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను అదనంగా అప్పగించింది. ఇంతకాలం ఆ బాధ్యతలు (అదనపు హోదాలో) చూస్తున్న సునీల్ శర్మను అక్కడి నుంచి రిలీవ్ చేసింది రాష్ట్ర సర్కార్.

Also Read: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన తొలగించిన బోర్డ్

8 మంది ఐఎఫ్‌ఎస్‌ అధికారుల బదిలీ..

* పైఫుల్లాను పంచాయతీ రాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ స్పెషల్‌ కమిషనర్‌గా నియామకం.
* ప్రియాంక వర్గీస్‌- సీసీఎఫ్‌ (ఐటీ)
* ఎస్టే ఆశా – ములుగు ఫారెస్ట్‌ కాలేజి డైరెక్టర్‌
* ప్రభాకర్‌- కాళేశ్వరం సర్కిల్‌ సీసీఎఫ్‌
* రవి కిరణ్‌ – మీ సేవా కమిషనర్‌
* ఆపర్ణ – డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌
* అంజు అగర్వాల్‌ – వరంగల్‌ డీఎఫ్‌వో

Advertisment
Advertisment
తాజా కథనాలు