MP Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కాపాడాలని సీఎంను కోరారు. By V.J Reddy 29 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MP Bandi Sanjay Letter To CM Revanth: బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కాపాడాలని సీఎంను కోరారు. బండి సంజయ్ లేఖలో.." సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం వలన గత 4 నెలలుగా యజమానులు, నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మీకు తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావలసిన పాత బకాయిలు 270 కోట్ల రూపాయలు ఇంతవరకు చెల్లించలేదు. కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదు. ఫలితంగా వస్త్ర పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి పని చేస్తున్న దాదాపు 20 వేల మంది పవర్ లూమ్ మరియు అనుబంధ రంగాల కార్మికులు పనుల్లేక పస్తులుంటున్నారు. అప్పులు చేస్తూ ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ బకాయిలు చెల్లించాలని, కొత్త ఆర్డర్లతో వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని గత 27 రోజులుగా చేనేత కార్మికులు సమ్మె చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుండి ఇంతవరకు కనీస స్పందన లేకపోవడం బాధాకరం. గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు ప్రవేశపెట్టి ఖచ్చితంగా బతుకమ్మ చీరలను నేయాలంటూ ఆసాములను, యజమానులపై ఒత్తిడి చేసి పాత వ్యాపారాలను బంద్ చేయించింది. ఆ తరువాత మాస్టర్ వీవర్స్ పేరుతో పెద్ద యజమానులకు బతుకమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చి చిన్న యజమానులను, ఆసాములుగా కూలీలుగా మార్చింది. ALSO READ: కాంగ్రెస్ లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసిన యజమానులకు సైతం ప్రభుత్వం నుండి సక్రమంగా పేమెంట్లు రాకపోవడంతో దాదాపు రూ.270 కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో వ్యాపారాలు చేయడానికి డబ్బుల్లేక, కొత్త ఆర్డర్లు లేక యజమానులు వస్త్ర పరిశ్రమను బంద్ పెట్టారు. ఫలితంగా పరిశ్రమతోపాటు అనుబంధంగా ఉన్న వార్పిన్, సైజింగ్, డైయింగ్ రంగాలపై ఆధారపడి బతుకుతున్న వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గత 27 రోజులుగా ఆసాములు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారి డిమాండ్లు న్యాయమైనవే. వెంటనే మీరు స్పందించి సమ్మె విరమింపజేయడంతోపాటు ప్రభుత్వ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాను. అట్లాగే పవర్ లూం కార్ఖానాలకు గత 24 సంవత్సరాల నుండి 50 శాతం సబ్సిడీతో అందిస్తున్న విద్యుత్ ను నిలిపివేయడంతో రెట్టింపు విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. ఆసాములు ఆ బిల్లులు చెల్లించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కోట్లాది రూపాయల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. తక్షణమే విద్యుత్ బకాయిలను మాఫీ చేయడంతోపాటు విద్యుత్ సబ్సిడీని యథావిధిగా కొనసాగించాలని కోరుతున్నాను. దీంతోపాటు కార్మికులకు ఇవ్వాల్సిన 10 శాతం యార్న్ సబ్సిడీని వెంటనే అందించాలి. నేత కార్మికుడిని ఆసామి చేయాలనే సంకల్పంతో గత ప్రభుత్వం రూ.370 కోట్ల వ్యయంతో ప్రవేశపెట్టిన 'వర్కర్ టు ఓనర్' పథకం అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఈ పథకాన్ని వెంటనే ప్రారంభించడంతోపాటు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను సంక్షోభం నుండి అధిగమించేలా అన్ని చర్యలు తీసుకోవాలని మనవి." అని లేఖలో పేర్కొన్నారు. #cm-revanth-reddy #bandi-sanjay #2024-lok-sabha-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి