🔴Lok Sabha Elections 2024: ఎన్నికల షెడ్యూల్ ఈసీ లైవ్

కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఇంకా ఆంధ్రా, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ECI సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈషెడ్యూల్ ప్రకటనను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. షెడ్యూల్ వచ్చిన వెంటనే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రానుంది.

New Update
🔴Lok Sabha Elections 2024: ఎన్నికల షెడ్యూల్ ఈసీ లైవ్

సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. విజ్ఞాన్‌భవన్‌ ప్లీనరీ హాల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ తో పాటు జ్ఞానేశ్‌కుమార్‌, సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధులతో కలిసి ఎన్నికల షెడ్యూల్‌న్ విడుదల చేస్తున్నారు.  18వ లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తున్నారు. ప్రస్తుత లోక్‌సభకు జూన్‌ 16తో గడువు ముగియనుంది. దీంతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందుకోసం ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల కమిషన్.. స్థానిక రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలను నిర్వహించింది.

  • Mar 16, 2024 16:02 IST
    రెండో దశలో 21 రాష్ట్రాల్లో పోలింగ్



  • Mar 16, 2024 16:01 IST
    ఏపీ, తెలంగాణలో ఒకేరోజు ఎన్నికలు



  • Mar 16, 2024 15:58 IST
    ఏడవ దశ జూన్ 1 వ తేదీ



  • Mar 16, 2024 15:58 IST
    ఆరవ దశ మే25వ తేదీ



  • Mar 16, 2024 15:58 IST
    ఐదవ దశ ఎన్నికల పోలింగ్ మే 20 వతేదీ



  • Mar 16, 2024 15:57 IST
    నాల్గవ దశ మే 13న



  • Mar 16, 2024 15:57 IST
    నాల్గవ దశలో ఏపీ ఎన్నికలు



  • Mar 16, 2024 15:57 IST
    మూడవ దశ మే 7వ తేదీ



  • Mar 16, 2024 15:57 IST
    రెండవ దశ ఏప్రిల్ 26



  • Mar 16, 2024 15:57 IST
    మొదటి దశ ఎన్నికలు ఏప్రిల్ 19



  • Mar 16, 2024 15:56 IST
    సిక్కింలో మార్చి 27న నోటిషికేషన్, పోలింగ్ ఏప్రిల్ 19న...కౌంటింగ్ జూన్ 4



  • Mar 16, 2024 15:55 IST
    అరుణాచల్ ప్రదేశ్‌లో మార్చి 27న నోటిఫికేషన్, ఏప్రిల్ 19న పోలింగ్..జూన్‌ 4న కౌంటింగ్



  • Mar 16, 2024 15:54 IST
    ఒడిశాలో ఏప్రిల్ 18న నోటిఫికేషన్, మే 13న పోలింగ్..జూన్ 4న కౌంటింగ్



  • Mar 16, 2024 15:52 IST
    ఆంధ్రాలో మే 20న లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్



  • Mar 16, 2024 15:50 IST
    జూన్‌ 4 న ఓట్ల లెక్కింపు



  • Mar 16, 2024 15:50 IST
    ఆంధ్రలో మే 13న పోలింగ్



  • Mar 16, 2024 15:49 IST
    ఏపీలో ఏప్రిల్ 18ను అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్



  • Mar 16, 2024 15:48 IST
    మొత్తం 7 దశల్లో ఎన్నికల నిర్వహణ



  • Mar 16, 2024 15:47 IST
    తెలంగాణలో కూడా బైఎలక్షన్స్



  • Mar 16, 2024 15:47 IST
    26 రాష్ట్రాల్లో ముందుగా బై ఎలక్షన్స్..



  • Mar 16, 2024 15:47 IST
    వ్యక్తిగత దూషనలకు దూరంగా ఉండాలి



  • Mar 16, 2024 15:46 IST
    పోలింగ్ కేంద్ర పర్యవేక్షణకు డ్రోన్లు-రాజీవ్ కుమార్



  • Mar 16, 2024 15:44 IST
    ఎన్నికల పర్యవేక్షణకు 2100 అబ్జర్వర్ల నియామకం



  • Mar 16, 2024 15:43 IST
    ఎన్నికల ప్రచారంలో పిల్లలను దూరంగా ఉంచాలి



  • Mar 16, 2024 15:42 IST
    ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు



  • Mar 16, 2024 15:42 IST
    కుల, మతాలను రెచ్చగొట్టేలా స్పీచ్‌లు ఇవ్వొద్దు



  • Mar 16, 2024 15:41 IST
    ప్రేమగా ప్రచారం చేయండి..రాజకీయ నాయకులకు హెచ్చరిక



  • Mar 16, 2024 15:40 IST
    ప్రచారంలో హద్ధులను మీరొద్దు...రాజీవ్ కుమార్



  • Mar 16, 2024 15:39 IST
    ఫేక్‌ న్యూస్‌పై ఫ్యాక్ట్‌ చెక్‌



  • Mar 16, 2024 15:38 IST
    సోషల్ మీడియా పోస్ట్‌ల నియంత్రణకు ప్రత్యేక అధికారుల బృందం



  • Mar 16, 2024 15:35 IST
    ఈడీ, ఐటీ సహకారంతో అన్ని రాష్ట్రాల్లో నిఘాను పెంచాం-సీఈసీ



  • Mar 16, 2024 15:34 IST
    బ్యాంక్ ఖాతాల మీద ప్రత్యేక మానిటరింగ్



  • Mar 16, 2024 15:34 IST
    ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే వారి మీద కఠిన చర్యలు



  • Mar 16, 2024 15:34 IST
    ఎన్నికల్లో హింసకు పాల్పడితే నాన్ బెయిలబుల్ అరెస్ట్



  • Mar 16, 2024 15:33 IST
    కర్ణాటకలో 384 కోట్లు



  • Mar 16, 2024 15:33 IST
    తెలంగాణలో 778 కోట్ల అక్రమ ధనం



  • Mar 16, 2024 15:32 IST
    2022-23 ఎలక్షన్స్‌లో 3400 కోట్ల అక్రమ డబ్బు సీజ్



  • Mar 16, 2024 15:31 IST
    ఎన్నికల్లో అక్రమ డబ్బులు రవాణా జరగకుండా చూసుకుంటాం



  • Mar 16, 2024 15:30 IST
    ఎన్నికల నిర్వహణలో డబ్బులు దుర్వినియోగం చేయనివ్వం-రాజీవ్ కుమార్



  • Mar 16, 2024 15:30 IST
    ఎన్నికల విధులకు దూరంగా వాలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది



  • Mar 16, 2024 15:29 IST
    ఎన్నికల విధుల్లో 1.5 కోట్ల మంది ఉద్యోగులు



  • Mar 16, 2024 15:29 IST
    12 రాష్ట్రాల్లో మహిళా ఓటర్లే ఎక్కువ



  • Mar 16, 2024 15:28 IST
    నేర చరిత్ర ఉన్నవారు మూడు పేపర్లలో ప్రకటన ఇవ్వాలి



  • Mar 16, 2024 15:27 IST
    దివ్యాంగులకు కూడా ఓట్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్



  • Mar 16, 2024 15:27 IST
    ఏప్రిల్ 1 వరకు ఓటర్ గుర్తింపు కార్డులో మార్పులు చేసుకునే అవకాశం



  • Mar 16, 2024 15:26 IST
    సీ-విజిల్ ద్వారా ఓటర్లు ఫిర్యాదు చేసుకునే అవకాశం



  • Mar 16, 2024 15:24 IST
    18-19 ఏళ్ళ మధ్య ఉన్న ఓటర్లు 18 లక్షల మంది



  • Mar 16, 2024 15:24 IST
    ఈరోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి



  • Mar 16, 2024 15:24 IST
    మొదటిసారి ఓటేయనున్న 1.85 కోట్ల మంది యువత



  • Mar 16, 2024 15:22 IST
    85 ఏళ్ళు దాటిన వారు ఇంటి నుంచి ఓట్



Advertisment
Advertisment
తాజా కథనాలు