Telangana: పక్కా వ్యూహంతో బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు సాధించేనా?! అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభం చవిచూసిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెంచింది. ఎంపీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచేలా పక్కా స్కెచ్ వేస్తున్నారు గులాబీ బాస్. జనవరి 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. By Shiva.K 29 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Lok Sabha Elections - BRS: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయ సాధిస్తామని.. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన బీఆర్ఎస్(BRS).. ఘోర పరాజయం చవిచూసింది. కేవలం 39 స్థానాల్లో గెలుపొంది.. ప్రతిపక్షంలో కూర్చుంది. 64 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్(Congress) రాష్ట్రంలో అధికారం చేపట్టింది. అయితే, అప్పటి నుంచి బీఆర్ఎస్ కాస్త సైలెంట్ అయిపోయినట్లు కనిపిస్తోంది. ఈ సైలెన్స్ కారణంగానే.. ఇటీవల జరిగిన సింగరేణి కార్మిక సంఘం(Singareni Elections) ఎన్నికల్లోనూ ఘోరంగా ఓడిపోయింది. మరి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఇలాగే ఉంటుందా? లేక గేరు మార్చి ఎన్నికల కథన రంగంలోకి దూకుతుందా? అనే అంశంపై రాజకీయాల్లో ఇంట్రస్టింగ్ చర్చ నడుస్తోంది. అయితే, బీఆర్ఎస్ నుంచి రీసౌండ్ గట్టిగానే ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు పక్కా వ్యూహంతో సంసిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్.. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. తెలంగాణ భవన్ వేదికగా సమావేశాలు నిర్వహించనుంది. జనవరి 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వరుసగా సమావేశాలు నిర్వహించనుంది బీఆర్ఎస్. ఈ మేరకు శుక్రవారం నాడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ముఖ్య నేతలంతా హాజరు కావాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఈ సమావేశాల్లో పార్టీ సీనియర్ నేతలంతా పాల్గొననున్నారు. నియోజకవర్గాల వారీగా కీలక నేతలకు బాధ్యతలు అప్పగించనున్నారు గులాబీ బాస్ కేసీఆర్. సమావేశాల నిర్వహణ బాధ్యతలు వారికే.. కేటీఆర్ (KTR), హరీష్‌రావు, కేశవరావు, మధుసూధనాచారి, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్‌రెడ్డిలకు సమావేశాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు కేసీఆర్ (KCR). అంతకంటే ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు గులాబీ బాస్. కేసీఆర్ దూరం.. అయితే, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలకు పార్టీ అధినేత కేసీఆర్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. గాయం నుంచి ఇంకా కోలుకోని కారణంగా కేసీఆర్ ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు హాజరు కావడం లేదని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. బీఆర్ఎస్ నిలిచేనా? ఓవైపు కాంగ్రెస్ 17కి 17 తామే గెలుస్తామని దీమా వ్యక్తం చేస్తుండగా.. కనీసం 10 సీట్లు గెలిచేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది బీజేపీ. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు చిక్కుతుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. గత జనరల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 ఎంపీ సీట్లు గెలుపొందగా.. కాంగ్రెస్ 3, బీజేపీ 4, ఏఐఎంఐఎం 1 చొప్పున సీట్లు గెలిచాయి. Also Read: ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ న్యూఇయర్ గిఫ్ట్.. అదేంటంటే..! కాళేశ్వరంలో భారీ అవినీతి.. మంత్రుల సంచలన ఆరోపణలు.. #brs #telangana #lok-sabha-elections-2024 #parliament-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి