Ayodya Rammandir: రామమందిర ప్రారంభోత్సవానికి అద్వానీ కూడా వస్తారు.. వీహెచ్‌పీ సంచలన ప్రకటన.. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి బీజేపీ సీనియర్ నేత, ఎల్‌కే అద్వానీ కూడా హాజరవుతారని విశ్వహిందూ పరిషత్ (VHP) ప్రకటించింది. మరో బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఈ కార్యక్రమానికి హాజరవుతారో లేదో ఇంకా స్పష్టత లేదని తెలిపింది. By B Aravind 11 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే రామమందిర ప్రారంభోత్సవం కోసం దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు అయోధ్యకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు అయోధ్యలో 80 శాతం హోటళ్లు కూడా బుక్ అయిపోయాయి. అంతేకాదు గదుల అద్దె ధరలను కూడా హోటల్ యజమానులు అమాంతం పెంచేశారు. అద్వానీ వస్తారు ఇదిలాఉండగా అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి బీజేపీ సీనియర్ నేత, ఎల్‌కే అద్వానీ కూడా హాజరవుతారని విశ్వహిందూ పరిషత్ (VHP) ప్రకటించింది. అయితే మరో బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి మురళీ మనోహర్ జోషి ఈ కార్యక్రమానికి హాజరవుతారో లేదో అనే అంశంపై ఇంకా స్పష్టత లేదని వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆలోక్ కుమార్ గురువారం తెలిపారు. జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవానికి అద్వానీ మాత్రం హాజరవుతారని స్పష్టం చేశారు. ఆయన కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తామని తెలిపారు. Also Read: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. అదనపు కోచ్‌లతో వెళ్తున్న రైళ్లు ఇవే.. మురళి మనోహర్ జోషీ కూడా రామ మందిరం ప్రారంభోత్సవానికి వచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారని పేర్కొన్నారు. అయితే అయోధ్య రామమందిరం ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు రామమందిర ప్రారంభోత్సవానికి రావడం లేదంటూ గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ డిసెంబర్ 18న మీడియాతో ఈ అంశంపై స్పందించారు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే ఆహ్వానించలేదు అద్వానీ, మురళి మనోహర్ జోషీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్లని ఆలయ ప్రారంభోత్సవానికి హాజరుకావద్దని విజ్ఞప్తి చేశామని తెలిపారు. మా వినతిని వాళ్లిద్దరు కూడా అంగీకరించారని చెప్పారు. దీంతో వాళ్లిద్దరు రావడం లేదని తెలియడంతో తీవ్రంగా విమర్శలు వచ్చాయి. డిసెంబర్ 20న ఆలక్ కుమార్ స్వయంగా వారి వద్దకు వెళ్లి రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానాన్ని అందించారు. మరో విషయం ఏంటంటే ప్రస్తుతం మురళీ మనోహర్ జోషికి 89 సంవత్సరాలు ఉండగా.. ఎల్‌కే అద్వానీకి 96 ఏళ్లు. Also Read: తమిళనాడులో పరువు హత్య.. కన్న కూతురిని దారుణంగా హత్య చేసిన తల్లిదండ్రులు.. #bjp #lk-advani #vhp #ayodya-rammandir మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి