Liquor Scam: 'లిక్కర్' టెన్షన్.. ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ‘సుప్రీం’ ఆదేశం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై దాదాపు ఏడాదిన్నరగా దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు స్పందించింది. ఆరు నెలల్లోగా లిక్కర్ కేసు దర్యాప్తును పూర్తిచేయాలని సీబీఐ, ఈడీలను ఆదేశించింది. By Naren Kumar 09 Dec 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై దాదాపు ఏడాదిన్నరగా దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ స్కామ్‌లో ఇరుక్కున్న ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాతో పాటు మరికొందరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు స్పందించింది. సీబీఐ, ఈడీలకు కీలకు సూచనలు చేసింది. ఆరు నెలల్లోగా లిక్కర్ కేసు దర్యాప్తును పూర్తిచేయాలని ఆదేశించింది. విచారణకు ముందు ప్రజలను కటకటాల వెనుక ఉంచలేరని.. సీబీఐ ఆరోపిస్తున్న దానికి.. ఈడీ ఆరోపిస్తున్న దానికి మధ్య వైరుధ్యం ఉందని తెలిపింది. ఇది కూడా చదవండి: నా ఫోన్ హ్యాక్ చేశారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు! ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గతంలో ఈడీ తమ ఛార్జ్‌షీట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈడీ ఆమెను విచారణ కూడా చేసింది. చాలామంది కవిత అరెస్టు అవుతుందని అనుకున్నారు. కానీ ఆమె అరెస్టు కాకపోవడంతో తెలంగాణ ప్రజల్లో అయోమయం నెలకొంది. అయితే ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసును ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించడం చర్చనీయాంశమవుతుంది. ఇప్పుడు ఈ కేసులో ఎలాంటి పురోగతి వస్తుందో.. ఇంకా ఎవరెవరు అరెస్టు అవుతారా అనే దానిపై సర్పత్రా ఆసక్తి నెలకొంది. #liquor-scam #supreme-court మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి