/rtv/media/media_files/2025/03/07/6cmhumsDqbCYEGm5bfUb.jpg)
reproductive health: uterus tumor signs
Women's day 2025: ఈ రోజుల్లో చాలా మంది మహిళలు సహజంగా గర్భం దాల్చడంలో అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలి విధానాలు, హార్మోనల్ లోపాలు, పీసీఓడీ ఇలా దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో ఒకటి గర్భాశయంలో ట్యూమర్లు. చాలా మంది మహిళలు తెలియకుండానే ఈ సమస్యతో బాధపడుతుంటారు. వీటివల్ల గర్భం దాల్చడంలో సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో ఈ ట్యూమర్స్ క్యాన్సర్ కి కూడా దారితీసే ప్రమాదం ఉంటుంది. అయితే వీటిని ఎర్లీగా గుర్తించడం ద్వారా సమస్యను అరికట్టవచ్చు. గర్భాశయంలో గడ్డను కొన్ని సంకేతాల ద్వారా గుర్తించవచ్చు అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
గర్భాశయంలో ట్యూమర్ సంకేతాలు
ప్రెగ్నెన్సీకి ఇబ్బంది..
పెళ్ళైన స్త్రీ చాలా కాలంగా గర్భం దాల్చాలని కోరుకుంటున్నప్పటికీ.. ప్రెగ్నెన్సీ రాకపోవడం గర్భాశయంలో గడ్డకు కారణం కావచ్చు.
సంభోగం సమయంలో నొప్పి లేదా రక్తస్రావం
సంభోగం సమయంలో నొప్పి లేదా రక్తస్రావం ఉంటే, అది గర్భాశయంలో ట్యూమర్ ఉండడానికి సంకేతం కావచ్చు. గర్భాశయంలో ట్యూమర్ ఉన్నప్పుడు తేలికపాటి లేదా తీవ్రమైన నొప్పి ఉండవచ్చు. ఇలాంటి లక్షణాలను అస్సలు విస్మరించవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం తప్పనిసరి.
రక్తస్రావం
మహిళలకు ఋతుచక్ర సమయంలో అధిక రక్తస్రావం ఉండడం గర్భాశయంలో ట్యూమర్ కి సంకేతం కావచ్చు. పీరియడ్స్ సకాలంలో రాకపోయినా లేదా ఎక్కువ కాలం అయినా ట్యూమర్లకు కారణమయ్యే అవకాశం ఉంది.
ఋతుస్రావ సమయంలో నొప్పి
పీరియడ్స్ సమయంలో నొప్పి రావడం సహజమే, కానీ నొప్పి చాలా ఎక్కువగా , భరించలేనంతగా ఉంటే.. గర్భాశయంలో గడ్డకు సంకేతం కావచ్చు. అలాగే ఈ నొప్పి గర్భాశయంలో మంటకు కూడా కారణం కావచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.