Bathukamma: వేపకాయల బతుకమ్మ..ఆ పేరెందుకు వచ్చింది? వేపచెట్టు అంటే ఆ ఆదిపరాశక్తి అమ్మవారికి సాక్షాత్తూ ప్రతిరూపం. అలాంటి ఆదిపరాశక్తికి పూజిస్తూ వేపకాయల బతుకమ్మను మహిళలు ఆరాధిస్తారు. ప్రత్యేక పిండి వంటం సకినాలను బియ్యం పిండితో చిన్న వేప పండ్ల ఆకారంలో ముద్దలుగా చేసి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. By Vijaya Nimma 07 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Bathukamma షేర్ చేయండి Bathukamma: తెలంగాణ కీర్తిని ప్రపంచానికే చాటిచెప్పిన వేడుక బతుకమ్మ. రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మను పిల్లాపెద్దా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మొదటి ఐదురోజులు ఉత్సాహంగా ఆడిపాడిన మహిళలు. ఆరోరోజు అలిగిన బతుకమ్మ సందర్భంగా ఎలాంటి ఆటపాటలు, కార్యక్రమాలు నిర్వహించుకోరు. ఆ తర్వాత ఏడోరోజును వేపకాయల బతుకమ్మగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తంగేడు, చామంతి, గులాబీ, గునుగు పూలతో ఏడు అంతరాల్లో బతుకమ్మను పేరుస్తారు. వేపచెట్టు అంటే ఆ ఆదిపరాశక్తి అమ్మవారికి సాక్షాత్తూ ప్రతిరూపం. అలాంటి ఆదిపరాశక్తికి పూజిస్తూ వేపకాయల బతుకమ్మను మహిళలు ఆరాధిస్తారు. వేప పండ్ల ఆకారంలో ముద్దలుగా తయారు చేసి: అంతేకాకుండా తెలంగాణలో శక్తి స్వరూపంగా వెలసిల్లుతున్న ఎల్లమ్మ తల్లిని కూడా అంతే భక్తితో మహిళంతా పూజిస్తారు. తెలంగాణ ప్రత్యేక పిండి వంట అయిన సకినాలను చేయడానికి వినియోగించే బియ్యం పిండితో చిన్న వేప పండ్ల ఆకారంలో ముద్దలుగా తయారు చేసి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. అంతేకాకుండా బెల్లం, పప్పును కూడా తల్లికి సమర్పిస్తారు. బియ్యం పిండిలో విటమిన్-డి, బితో పాటు క్యాల్షియం, ఫినోలిక్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అని చెబుతున్నారు వైద్యులు. నిద్రను ప్రోత్సహించే ఎరోటినిన్ హార్మోన్‌ను కూడా ఇది పెంచుతుంది. అంతేకాకుండా ఇందులోని కార్బొహైడ్రేట్స్ శరీరానికి శక్తిని ఇస్తాయని సైన్స్ చెబుతోంది. అంతా కలిసి బతుకమ్మ దగ్గర ఆడిపాడి. తలకెత్తుకుని చెరువులు, నదుల దగ్గరికి వెళ్లి అక్కడ బతుకమ్మ కాసేపు ఆడి గంగమ్మ ఒడికి బతుకమ్మను చేరుస్తారు. తర్వాత ఇంటికి వచ్చి ముత్తైదువులను పిలిచి వాయనంగా వేప ఉండలు, బెల్లం, పప్పును అందిస్తారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఇది కూడా చదవండి: రాత్రి తినకుండా పడుకుంటే ఇన్ని రోగాలు వస్తాయా..? #telangana #Bathukamma 2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి