ఇండియాలో సైలెంట్ హెల్త్ ఎమర్జెన్సీ.. NFHS-6 రిపోర్ట్ షాకింగ్ నిజాలు!

ఒకవైపు చూస్తేనేమో ఇండియా సూపర్ ఫాస్ట్‌గా డెవలప్ అవుతోంది అంటారు... మన ఆసుపత్రులు వరల్డ్ క్లాస్ అంటారు. కానీ ఇంకోవైపు చూస్తే, మన ఇంట్లో ప్రతి నలుగురిలో ఒకరు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

New Update
nfh6

ఒకవైపు చూస్తేనేమో ఇండియా సూపర్ ఫాస్ట్‌గా డెవలప్ అవుతోంది అంటారు... మన ఆసుపత్రులు వరల్డ్ క్లాస్ అంటారు. కానీ ఇంకోవైపు చూస్తే, మన ఇంట్లో ప్రతి నలుగురిలో ఒకరు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇది నా మాట కాదు... సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే  చెబుతున్న పచ్చి నిజం! రిసెంట్ గా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ NFHS-6 డేటాను రిలీజ్ చేసింది. ఇందులో కొన్ని విషయాలు చూస్తే "వావ్, మనం ఎంత డెవలప్ అయ్యామో కదా" అనిపిస్తుంది. కానీ, ఇంకొన్ని పేజీలు తిరగేస్తే... మన దేశం ఒక సైలెంట్ హెల్త్ ఎమర్జెన్సీ  వైపు వెళ్తోందని భయమేస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే... ఈ రిపోర్ట్ లో ఒక మ్యాజిక్ ట్రిక్ జరిగింది. అదేంటంటే... ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే కీలకమైన డేటా అసలు రిపోర్ట్ లోనే లేదు.. గాల్లో కలిసిపోయింది!

అసలు ఈ NFHS-6 రిపోర్ట్ ఏం చెప్తోంది? మన పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది? యూత్ ఎందుకు తగ్గిపోతున్నారు? ఊబకాయం, షుగర్ వ్యాధులు మనల్ని ఎలా ఆక్రమిస్తున్నాయి? ఇంకో ముఖ్యమైన విషయం.. ఆ మాయమైన డేటా వెనక ఉన్న సీక్రెట్ ఏంటి? ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మన దేశ భవిష్యత్తు ఆరోగ్యం ఎలా ఉండబోతోందో మీకు ఒక క్లారిటీ వస్తుంది.

ఎప్పుడూ నెగిటివ్ ఎందుకు, ఫస్ట్ పాజిటివ్ విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే మాతృ, శిశు ఆరోగ్య సంరక్షణలో ఇండియా నిజంగానే రికార్డులు బ్రేక్ చేసింది. "ఒకప్పుడు డెలివరీ అంటే ప్రాణాలతో చెలగాటం. కానీ ఇప్పుడు, పుట్టే ప్రతి బిడ్డకు ప్రభుత్వం ఒక భరోసా ఇస్తోంది."

సంస్థాగత ప్రసవాలు  :  ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది. మన దేశంలో ఇప్పుడు 90.6% డెలివరీలు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. అంటే సేఫ్ డెలివరీ అన్నమాట.
వ్యాక్సినేషన్ సక్సెస్:  12 నుంచి 23 నెలల పిల్లలకి ఇమ్యునైజేషన్ కవరేజ్ 87.1% కి చేరింది. రోటావైరస్ వ్యాక్సిన్ అయితే ఏకంగా 36.4% నుంచి 85.4% కి జంప్ అయింది!
న్యూట్రిషన్ :   పిల్లల్లో ఎదుగుదల లోపం 35.5% నుంచి 29.3% కి తగ్గింది. ఇది ఫ్యూచర్ జనరేషన్‌కి చాలా పెద్ద ప్లస్ పాయింట్.

ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే... మహిళా సాధికారత  ఇప్పుడు ఇండియాలో 64.3% మంది మహిళలు ఇంటర్నెట్ వాడుతున్నారు. 89% మందికి సొంత బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే, "అబ్బో.. మేరా భారత్ మహాన్" అని కాలర్ ఎగరేయాలనిపిస్తుంది కదా! కానీ... పిక్చర్ అప్పుడే అయిపోలేదు బాస్. నాణేనికి మరోవైపు కూడా ఉంది..!

మనం అంటువ్యాధులను జయించాం కరెక్టే. కానీ మనల్ని మనం జయించలేకపోతున్నాం. మన లైఫ్ స్టైల్ మన పాలిట శాపంగా మారుతోంది. NFHS-6 రిపోర్ట్‌లో బట్టబయలైన ఒక చేదు నిజం... ఊబకాయం,  మధుమేహం 

ఒకప్పుడు ఊబకాయం అంటే డబ్బున్న వాళ్ల జబ్బు. కానీ ఇప్పుడు ఇది ప్రతి గడపకూ చేరింది.  తాజా సర్వే ప్రకారం: ఇండియాలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు, ప్రతి నలుగురు పురుషుల్లో ఒకరు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. అంతేనా? ప్రతి ఐదుగురు వయోజన పురుషుల్లో ఒకరికి హై బ్లడ్ షుగర్ ఉంది.

ఆర్థిక సర్వే 2025-26 కూడా మొన్నే ఒక హెచ్చరిక చేసింది. మన దేశంలో అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ అమ్మకాలు 2009 నుండి 2023 మధ్య ఏకంగా 150 శాతానికి పైగా పెరిగాయి. మనం తినే పిజ్జాలు, బర్గర్లు, స్నాక్సే మనల్ని నిలువునా ముంచేస్తున్నాయి. డాక్టర్లు దీన్నిమెటబాలిక్ మహమ్మారి  అంటున్నారు. "పొట్ట పెరిగితే ఆస్తి పెరిగినట్టు కాదు బాస్... రోగం పెరిగినట్టు! ఫ్యాటీ లివర్, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి డెడ్లీ డిసీజెస్‌కి ఈ ఊబకాయమే ఫస్ట్ స్టెప్."

ఇందులో ఇంకో డేంజర్ ఏంటంటే... భారతీయులకు ఒక శారీరక విలక్షణత ఉంది. డాక్టర్ రాజీవ్ కోవిల్ చెప్పిన దాని ప్రకారం, మనకి పైకి లావుగా కనిపించకపోయినా, లోపల అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. దీన్నే థిన్-ఫ్యాట్ ఫినోటైప్ అంటారు. అంటే సన్నగా ఉన్నా సరే, షుగర్, BP లాంటి కార్డియోమెటబాలిక్ ప్రమాదాలు పొంచి ఉన్నాయి.

తరువాత మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన టాపిక్... డెమోగ్రఫీ. ప్రపంచంలోనే అత్యంత యూత్ పాపులేషన్ ఉన్న దేశం మనది అని ఎప్పుడూ గర్వంగా చెప్పుకుంటాం. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. దేశ జనాభాలో 60 ఏళ్లు పైబడిన వారి శాతం11.8% నుంచి 12.9% కి పెరిగింది. ఇదే సమయంలో 15 ఏళ్లలోపు పిల్లల జనాభా 26.5% నుంచి 25.5% కి తగ్గింది. ఇందులో కేరళ టాప్‌లో ఉంది. అక్కడ ఏకంగా 20.7% మంది ఆరు పదులు దాటినవాళ్లే ఉన్నారు. ఆ తర్వాత గోవా, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ 9వ స్థానంలో, ఏపీ 12వ స్థానంలో ఉన్నాయి.

ఎందుకు ఇలా జరుగుతోంది?

ఫ్యామిలీ ప్లానింగ్ పెరిగింది, పిల్లల్ని కనడం తగ్గించారు. దీనివల్ల ఫ్యూచర్‌లో వర్కింగ్ ఏజ్ పాపులేషన్  తగ్గిపోయి, వృద్ధుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. జపాన్, చైనా లాంటి దేశాలు ఇప్పుడు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇదే.  ఇదొక ప్రాబ్లమ్ అయితే, మరోవైపు డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్‌న్యూట్రిషన్ అంటే... ఒకే సమాజంలో, ఒక్కోసారి ఒకే ఇంట్లో... ఒకరు ఓవర్ వెయిట్‌తో బాధపడుతుంటే, ఇంకొకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అంటే మనకు ఫుడ్ దొరుకుతోంది, కానీ క్వాలిటీ ఫుడ్ దొరకట్లేదు. 

ఇక ఇప్పుడు అసలు మ్యాటర్‌కి వద్దాం. ఈ NFHS-6 ఫ్యాక్ట్ షీట్ లో కొన్ని జిమ్మికులు జరిగాయి. లాస్ట్ టైమ్ NFHS-5 లో 131 ఇండికేటర్ ఉంటే, ఇప్పుడు వాటిని 101కి తగ్గించేశారు. ఆ 30 పారామిటర్స్ ఏమయ్యాయి? గాల్లో కలిశాయా? నో..! కావాలనే పక్కన పెట్టారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏ ఏ డేటాను మాయం చేశారో తెలుసా?

ఎనీమియా:  గత సర్వేలో మన దేశంలో పిల్లల్లో, గర్భిణీల్లో రక్తహీనత చాలా ఎక్కువగా ఉందని తేలింది. ప్రభుత్వం దీనిపై ఎన్ని స్కీమ్స్ తెచ్చినా రిజల్ట్ లేదు. దాంతో, ఈసారి ఆ డేటానే తీసేశారు. వేరే సర్వేలో చూసుకుందాం లే అని కవర్ చేశారు.
స్వచ్ఛ భారత్ :   2019లో ప్రభుత్వం దేశమంతా 100% బహిరంగ మలవిసర్జన రహితం అయిపోయిందని ప్రకటించింది. కానీ గత NFHS డేటా అది నిజం కాదని బయటపెట్టింది. అందుకే బహుశా, ఈసారి సానిటేషన్ డేటానే ఫ్యాక్ట్ షీట్ లో పెట్టలేదు.
ఉజ్వల యోజన:  పీఎం ఉజ్వల యోజన కింద కోట్లాది గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం అన్నారు. కానీ LPG గ్యాస్ వాడుతున్న వారి డేటా కూడా ఈ తాజా ఫ్యాక్ట్ షీట్ లో లేదు. 
"అంటే... మనకు జ్వరం వస్తే మందు వేసుకోవాలి కానీ, థర్మామీటర్ పగలగొట్టకూడదు కదా..! డేటా దాచేస్తే రియాలిటీ మారిపోదు."

ఈ డేటా సేకరణ వెనుక పెద్ద Controversyనే నడిచింది. ముంబైలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (IIPS) డైరెక్టర్ KS జేమ్స్‌ని సస్పెండ్ చేయడం వెనుక కూడా... ఈ డేటా ప్రభుత్వానికి నచ్చకపోవడమే కారణం అని అప్పట్లో పెద్ద పొలిటికల్ డిబేట్ జరిగింది. ఆ తర్వాత ఆయన రాజీనామా చేయడం, ఇప్పుడు రిపోర్ట్‌లో ఈ డేటా కనిపించకపోవడం... ఇవన్నీ చూస్తుంటే ఏదో పెద్ద స్కెచ్చే నడుస్తోంది అనిపిస్తుంది కదూ.!

సో, ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే?

ఇండియా మాతృ, శిశు ఆరోగ్య సంరక్షణలో, వాక్సినేషన్‌లో నిజంగానే అద్భుతాలు చేస్తోంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆయుష్మాన్ భారత్ లాంటి స్కీమ్స్ వల్ల 60% మందికి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ పెరిగింది. ఇది ఒక పాజిటివ్ సైన్.  కానీ...లైఫ్ స్టైల్ డీసీసెస్, ఊబకాయం, పెరుగుతున్న వృద్ధాప్యం మన దేశ భవిష్యత్‌కు పెద్ద ఛాలెంజ్‌గా ఉన్నాయి. వీటికి తోడు గవర్నమెంట్  పారదర్శకమైన డేటాను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే పాలసీలు కరెక్ట్‌గా పనిచేస్తాయి. లేకపోతే సగం నిజాలు, సగం అబద్ధాలతోనే మన బతుకులు సాగుతాయి.

Advertisment
తాజా కథనాలు