/rtv/media/media_files/2025/03/26/sCIcDXOYHmPx45JLXTjM.jpg)
Ugadi Photograph: (Ugadi)
హిందువులు తప్పకుండా ఉగాది పండుగను జరుపుకుంటారు. కొత్త దుస్తులతో ఎంతో భక్తితో ఉగాది పండుగను సరదాగా చేస్తుంటారు. అయితే ఈ ఏడాది ఉగాదిని మార్చి 30వ తేదీన జరుపుకుంటారు. ఉగాది పండుగ రోజు పూజ చేయడంతో పాటు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని పండితులు అంటున్నారు. అయితే ఉగాది పండుగ రోజు దానం చేయాల్సినవి ఏంటో చూద్దాం.
ఇది కూడా చూడండి: Liquor Shops : 1+1..వైన్ షాప్స్ బంపరాఫర్.. ఎగబడ్డ మందుబాబులు!
చలివేంద్రం
ఉగాది రోజున చలివేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఇంట్లో డబ్బు వృద్ధి చెందుతుందట. ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. ముఖ్యంగా రుణ బాధలు తీరి సంతోషంగా ఉంటారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం వల్ల డబ్బు, ఐశ్వర్యం, సంపద వృద్ధి చెందుతుంది. ఇంట్లో సంతోషంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: PF Withdraw -Atm: ఇక ఏటీఎం నుంచి పీఎఫ్ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?
విసనకర్ర
విసనకర్రను ఉగాది రోజున దానం చేయడం వల్ల దేవతల అనుగ్రహంతో పాటు పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుందని పండితులు అంటున్నారు. వీటితో పాటు సమస్యలు అన్ని కూడా తొలగిపోయి సుఖం వస్తుంది. అలాగే మోక్షం కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
మామిడి
మామిడితో ఉగాది రోజు పచ్చడి తయారు చేస్తారు. కొందరికి ఈ మామిడి లభించకపోవచ్చు. ఎవరైనా మీకు అడిగితే ఈ మామిడిని దానం చేయండి. దీనివల్ల మీకు పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: AP NEWS: షాకింగ్ న్యూస్.. ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ బంద్.. ఎందుకంటే?
అన్నదానం
అన్ని దానాల కంటే అన్న దానం చాలా గొప్పదని అంటుంటారు. అయితే ఈ దానం చేయడం వల్ల అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని, ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయని పండితులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చూడండి: IPL 2025: ఉత్కంఠ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ విక్టరీ..