Today Horoscope: నేడు ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఆ రాశులేవంటే?

నేడు కొన్ని రాశుల వారికి ఏం పట్టినా బంగారమే అని పండితులు అంటున్నారు. ప్రతీ విషయంలో అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు. మరి ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.

New Update
horoscope 2025 today

horoscope 2025 today

మేషం

ధైర్యంగా పనులు పూర్తి చేస్తే అనుకున్న ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుని, డబ్బు పొదుపు చేయడం మంచిది. సూర్యారాధన చేయడం వల్ల మేలు జరుగుతుంది.

వృషభం
మీకు ఇప్పుడు చాలా మంచి సమయం నడుస్తోంది. అదృష్టం కలిసి వచ్చి మొదలుపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. పెట్టుబడుల ద్వారా లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. లక్ష్మీదేవి పూజ శుభప్రదం.

మిథునం
ముఖ్యమైన పనుల్లో కాస్త కష్టం ఎక్కువగా ఉంటుంది. కానీ ఏకాగ్రతతో పనిచేస్తే విజయం మీదే. డబ్బు విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. వార చివరిలో మంచి ఫలితాలు ఉంటాయి. నవగ్రహ స్తోత్రం చదవడం మంచిది.

కర్కాటకం
పనుల విషయంలో సహనం, జాగ్రత్త చాలా అవసరం. కొన్ని అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. అందరితో కలిసి పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి.

సింహం
ఉద్యోగంలో మంచి ఎదుగుదల ఉంటుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపార సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఇంట్లో గొడవలు రాకుండా ప్రశాంతంగా ఉండటం మంచిది. సుబ్రహ్మణ్య స్వామి పూజ మేలు చేస్తుంది.

కన్య
దైవబలంతో మీకు మంచి రోజులు వస్తాయి. ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే ఆర్థికంగా ఎదుగుతారు, విజయాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. నవగ్రహాలను ప్రార్థించడం మంచిది.

తుల
ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో సమస్యలను ముందే గుర్తించి పరిష్కరిస్తారు. ఆర్థిక పరిస్థితి సాదాసీదాగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

వృశ్చికం
మీకు చాలా అనుకూలమైన సమయం. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. వచ్చిన అవకాశాలను వదులుకోవద్దు.

ధనుస్సు
వ్యాపార రంగంలో మంచి లాభాలు ఉంటాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగంలో మీ నిర్ణయాలకు ప్రశంసలు దక్కుతాయి. ముఖ్యమైన పనులు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త అవసరం. అమ్మవారిని స్మరించుకోండి.

మకరం
మీ ప్రయత్నాలు ఫలించే సమయం వచ్చింది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపార సమస్యలు తొలగి ఆర్థికంగా లాభపడతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. లక్ష్మీదేవి ధ్యానం శుభప్రదం.

కుంభం
వ్యాపారంలో స్పష్టమైన ఎదుగుదల, లాభాలు కనిపిస్తాయి. మీ కష్టానికి రెట్టింపు ప్రతిఫలం దక్కుతుంది. కొంత ఒత్తిడి ఉన్నా సహనంతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.

మీనం
మానసిక ధైర్యంతో అడ్డంకులను తెలివిగా అధిగమిస్తారు. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. ఆస్తుల వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ విషయాల్లో మాత్రం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. వేంకటేశ్వరస్వామి ఆరాధన మంచిది.

Advertisment
తాజా కథనాలు