ఆ కులం వారి మలాన్ని శూద్రులు చేత్తో తీయాలా? జైళ్లలో ఇంత దారుణమా!

తక్కువ కులాలవారితో మరుగుదొడ్లు కడిగిస్తారు.. చెత్త ఎత్తిస్తారు.. ఇదంతా జైల్లలో నాటుకుపోయిన కుల వివక్ష. అసలు జైల్లోకి కులవివక్ష ఎలా ప్రవేశించిందో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update

జైలుకు వెళ్లగానే నీ పేరేంటని కూడా అడగరట.. నీది ఏ కులమనే అడుగుతారు.. నీ కులాన్ని బట్టే జైల్లో నువ్వేం పని చేయాలో నిర్ణయిస్తారు. కులానికి తగ్గట్టుగా పని చేయించుకుంటారు. ఇది ప్రొఫెసర్ సాయిబాబా చెప్పిన మాటలు. అగ్రకులాల వారు సమాజం తక్కువగా భావించే పనులు చేయరు. వారికి సపరేటు పని ఉంటుంది.. తక్కువ కులాలవారితో మరుగుదోడ్లు కడిగిస్తారు.. చెత్త ఎత్తిస్తారు.. జైల్లోని కాలువలు క్లీన్ చేయిస్తారు. ఇలా జైల్లో కూడా కుల వివక్షే.. ఈ విషయాన్నే సుప్రీంకోర్టు లేవనెత్తింది. జైల్లో ఖైదీల పేరు నమోదు పత్రంలో క్యాస్ట్ కాలమ్‌ ఎందుకు ఉందో చెప్పాలని అధికారులను నిలదీసింది. కులం ఆధారంగా ఇలా పనులు అప్పగించడం రాజ్యాంగంలో ఆర్టికల్‌ 15ను ఉల్లింఘించినట్టేనని చెప్పిన సుప్రీంకోర్టు.. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ, ఏపీ, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్‌ పాటు 11 రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

మూడు నెలల్లో రూల్స్ మార్చండి:

  • బ్రిటీష్‌ పాలకులు అగ్రకులాల ఒత్తిడి కారణంగానే జైళ్లో కుల ప్రాతిపదికన పని కేటాయింపులు చేసేవారు. ఇది సాక్ష్యాత్తు సుప్రీంకోర్టు చెప్పిన మాట! ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఖైదీలను మురుగు ట్యాంకులు శుభ్రం చేసేందుకు అనుమతించకూడదని చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే ఈ కుల వివక్షకు సంబంధించిన కేసులను పరిష్కరించడంలో పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించిన సుప్రీంకోర్టు.. న్యాయం ప్రకారమే ఖైదీలకు పనులను కేటాయించాలని ఆదేశించింది. మూడు నెలల్లోగా ఈ రూల్స్‌ను సవరించాలని రాష్ట్రాలకు డెడ్‌లైన్‌ పెట్టింది.

కులం బట్టి జైల్లో బ్లాక్స్ ఉంటాయా..?

  • ఓ సారి తమిళనాడులోని పాలయంకోట్టై జైలు చూడండి. ఇక్కడ కేవలం ఖైదీలతో చేయించుకునే పనులే కాదు.. వారికి సపరేటు బ్లాక్స్‌ కూడా ఉంటాయి. ఓబీసీ కులాలకు చెందిన ఖైదీలకు ఓ బ్లాక్‌.. అగ్రకులాల ఖైదీలకు మరో బ్లాక్‌.. దళిత ఖైదీలకు ఇంకో బ్లాక్‌.! ఇలా ఏ కులానికి తగ్గట్టుగా సంబంధిత బ్లాక్స్‌లో ఏర్పాట్లు కూడా ఉంటాయి. దళిత కులాల్లోని అండర్ ట్రయల్‌ ఖైదీలకు కూడా ఒక సపరేటు బ్లాక్ ఉంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు దేశంలోని జైలుల్లో కుల వివక్ష ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి! 1990లో తమిళనాడులోని దక్షిణాది జిల్లాలు అత్యంత భయంకరమైన కుల హింసను చూశాయి. 1997జూన్‌లో మదురై జిల్లా-మెలవలవవు గ్రామంలో దళిత కులాలకు చెందిన ఆరుగురు నాయకులను తేవర్‌ కులాలకు చెందినవారు నరికి చంపారు. ఈ కేసులో వారిని పాలయంకోట్టై జైలుకు పంపారు. అక్కడ కూడా దళిత ఖైదీలను తేవర్‌ కులాల వారు దాడి చేస్తారనే అనుమానంతో నాడు రాష్ట్ర ప్రభుత్వం ఇలా జైలు బ్లాకులను కులాల వారిగా విభజించింది.

జైల్లో మాన్యువల్ స్కావెంజింగ్:

  • స్వాతంత్ర్యానికి ముందు చాలా రాష్ట్రాల్లోని జైలుల్లో ఉన్న కుల వివక్ష వ్యవస్థే ఆ తర్వాత కూడా కొనసాగింది. రాజస్థాన్‌ జైలు రూల్‌ నంబర్‌ 67 ప్రకారం వంట చేయాలంటే సంబంధిత ఖైదీ అగ్రకుల హిందువై ఉండాలి. వేరే మతాల వారు కూడా వంట చేయకూడదు. ఇక అన్నింటికంటే చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే చాలా రాష్ట్రాల్లోని జైలల్లో మాన్యువల్ స్కావెంజింగ్ జరుగుతోంది. అంటే చేతులతో మలం ఎత్తే పనులను జైలు అధికారులే ఎస్సీ కులాలవారితో చేయిస్తున్నారు. నిజానికి మాన్యువల్ స్కావెంజింగ్‌ను 1993లోనే ఇండియాలో నిషేధించారు.

ఇదంతా రాష్ట్రాల్లో చేతుల్లో ఉండే విషయమే!

  • వాస్తవానికి పశ్చిమ బెంగాల్ మినహా చాలా రాష్ట్రాలు 1894లోని జైలు చట్టాలనే ఇప్పటికీ ఫాలో అవుతున్నాయి. అయితే 2016లో బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్-BPRD ఓ జైలు మాన్యువల్‌ను రూపొందించింది. ఇందులో జైల్లో కుల వివక్షను రూపుమాపేలా రూల్స్‌ను పెట్టింది. అయితే జైలు అనేది 'స్టేట్ సబ్జెక్ట్..'! అంటే జైలుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా అది పూర్తిగా రాష్ట్రాలే తీసుకోవాల్సి ఉంటుంది. BPRD జైలు మాన్యువల్‌లో సూచించిన మార్పులను అమలు చేయడం పూర్తిగా రాష్ట్రాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఆ పనిని ఇండియాలో చాలా రాష్ట్రాలు చేయలేదు. పలు రాష్ట్రాలు ఇప్పటికే తమ జైలు మాన్యువల్స్‌ను మార్చుకున్నాయి కానీ ఏపీ, తెలంగాణతో పాటు మరి కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇప్పటికీ కుల వివక్ష ఉన్న మాన్యువల్స్‌నే పాటిస్తుండడం అత్యంత బాధాకరమైన విషయం.

ఇది కూడా చదవండి: ఐదో రోజు అట్ల బతుకమ్మ..విశిష్ఠతలు ఇవే!

#court
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: పహల్గాం దాడిని పూర్తిగా షూట్‌ చేస...

Pahalgam Attack: పహల్గాం దాడిని పూర్తిగా షూట్‌ చేసిన వీడియోగ్రాఫర్‌.. కానీ

బైసరన్‌కు వచ్చే పర్యాటకుల కోసం రీల్స్‌ను చిత్రీకరించే చేసే ఓ స్థానిక వీడియో గ్రాఫర్‌ ఈ దాడి మొత్తాన్ని తన కెమెరాలో షూట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో NIA అధికారుల వద్ద ఉంది. దీని ఆధారంగా ఈ దాడికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుంటున్నారు.

New Update
Baisaran Reels Videographer, Who Recorded Entire Pahalgam Attack

Baisaran Reels Videographer, Who Recorded Entire Pahalgam Attack

పహల్గాం ఉగ్రదాడి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దాడికి సంబంధించి ఓ కీలకమైన వీడియో బయటపడింది. బైసరన్‌కు వచ్చే పర్యాటకుల కోసం రీల్స్‌ను చిత్రీకరించే చేసే ఓ స్థానిక వీడియో గ్రాఫర్‌ ఈ దాడి మొత్తాన్ని తన కెమెరాలో షూట్ చేశాడు. ఈ దాడి జరుగుతున్న సమయంలో అతడు ఓ చెట్టుపై దాక్కొని మరీ దీన్ని షూట్ చేశాడు. ఈ వీడియో ఆధారంగా జరిగిన దారుణాన్ని పూర్తిగా తెలుసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థకు ఇది కీలకంగా మారింది.  

Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు

ముందుగా ఉగ్రవాదులు రెండు గ్రూపులుగా విడిపోయి లోయలో వేరువేరు దిక్కుల నుంచి తుపాకులతో కాల్పులు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ముందుగా ఇద్దరు ఉగ్రవాదులు సందర్శకులను ముస్లిం మతాచారాన్ని పాటించాలని బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం నలుగురిని కాల్చి చంపేశారు. దీంతో భయంతో సందర్శకులు పారిపోయారు. జిప్‌లైన్ అనే ప్రదేశం నుంచి మరో ఇద్దరు ఉగ్రవాదులు బయటకు వచ్చారు. వాళ్లు కూడా కాల్పులు జరిపారు.  

Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?
  
అయితే అక్కడున్న ఈ వీడియోగ్రాఫర్‌ తుటాల నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తాడు. ఓ చెట్టు కొమ్మపై దాక్కున్నాడు. ఆ తర్వాత మొత్తం ఈ ఉగ్రదాడిని షూట్‌ చేశాడు. ఈ విషయాన్ని ఓ సీనియర్ అధికారి చెప్పారు. అలాగే జాతీయ దర్యాప్తు సంస్థ అతడిని ప్రశ్నించి ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. ఉగ్రవాదులు, వాళ్లకు సహకరించిన గ్రౌండ్ వర్కర్లను గుర్తించేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పారు. ఉగ్రవాదులు దాడి చేసే సమయంలో స్థానికుల నుంచి రెండు ఫోన్లు కూడా లాక్కున్నారు. ఇప్పుడు అధికారులు వాటిని ట్రాక్ చేస్తున్నారు.  

 

Pahalgam attack | telugu-news | rtv-news 

 

Advertisment
Advertisment
Advertisment