ఆర్థరైటిస్‌ను తగ్గించే సూపర్ 7 ఫుడ్స్ ఆర్థరైటిస్, కీళ్ల నొప్పుల సమస్యల నుంచి విముక్తి పొందాలంటే ఈ సూపర్ ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోవాలి. సాల్మన్ ఫిష్, వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్, ఆకు కూరలు, బెర్రీలు, గింజలను డైలీ తీసుకోవడం వల్ల కీళ్ల సమస్యలన్ని పరార్ అయిపోతాయి. By Kusuma 07 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి జీవనశైలిలో మార్పుల కారణంగా చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా కొందరు ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే డైట్‌లో ఈ పదార్థాలను చేర్చుకుంటే ఆర్థరైటిస్‌కు చెక్ పెట్టవచ్చు. మరి ఆ పదార్థాలేంటో చూద్దాం. సాల్మన్ ఫిష్ కొవ్వు ఎక్కువగా ఉండే సాల్మన్ ఫిష్, మాకేరెల్, సార్డినెస్, ట్రౌట్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కీళ్ల నొప్పుల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఈ చేపలను తినడం వల్ల కండరాలు దృఢం అవుతాయి. బెర్రీలు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ సమస్య తగ్గుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిండంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. ఆకుకూరలు విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే బచ్చలికూర, పాలకూర వంటివి ఆర్థరైటిస్ సమస్యలను తగ్గిస్తాయి. ఇందులో ఉండే విటమిన్లు కీళ్ల కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. గింజలు వాల్‌నట్స్, గుమ్మడి గింజలు, అవిసె గింజలు వంటిని డైట్‌లో యాడ్ చేసుకుంటే ఆర్థరైటిస్ సమస్య తగ్గుతుంది. గింజల్లో మెగ్నీషియం, సెలీనియం, విటమిన్ ఈ కీళ్ల సమస్యలను తగ్గించడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇది కూడా చూడండి: Dry Fruits నానబెట్టే ఎందుకు తింటారు..? ఆలివ్ నూనె తినే వంటల్లో కూడా ఆలివ్ నూనె వాడటం వల్ల కీళ్లలో నొప్పి, వాపు తగ్గుతుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ ఆర్థరైటిస్ రాకుండా కాపాడుతుంది. పసుపు పసుపులోని కర్కుమిన్ కీళ్ల నొప్పులు రాకుండా అడ్డుకుంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ సమస్యల నుంచి విముక్తి కల్పిస్తాయి. వెల్లుల్లి శరీరంలో వ్యతిరేక కణాలతో పోరాడే శక్తి వెల్లుల్లికి ఉంటుంది. ఇది కీళ్లలో మంట, నొప్పిని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-tips #arthritis-symptoms మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి