/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Kamareddy_-A-man-was-brutally-murdered-in-Sirpur.-The-reason-was-extramarital-affair-jpg.webp)
prasad murder vijayanagaram
AP Crime: తాత ఇంటికి వచ్చి సరదా ఎంజాయ్ చేద్దామనుకున్నాడు. ఇంతలో ఏం జరిగిందో ఏం తెలియని కానీ ఒక్కసారి అటూ పెద్దలకు.. కుటుంబ సభ్యులకు దూరమయ్యాడు. ప్రసాద్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురైయ్యాడు. ఈ ఘటన ఏపీలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపి వివరాల ప్రకారం..
శరీరంపై దెబ్బలు తగిలిన ఆనవాళ్లు..
విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాంకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హత్యకు గురయ్యాడు. కొనారి ప్రసాద్ (28) అనే యువకుడిని హత్య చేశారు. మూరిపేట నుంచి నెమలాంకు బైక్‌పై వస్తుండగా సోమవారం రాత్రి ప్రసద్‌ని గుర్తు తెలియని వ్యక్తులు చంప్పేసి.. గ్రామ శివారులో పడేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. మృతుడి తలపై తీవ్ర గాయంతో పాటు శరీరంపై దెబ్బలు తగిలిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ప్రసాద్ ఉదోగ్యం చేస్తున్నాడు.
ఇది కూడా చదవండి: వంటలో నల్ల మిరియాలు వాడితే బరువు తగ్గుతారా?
మూడు రోజులు సెలవు ఉండటంతోపాటు తాత గ్రామానికి వచ్చాడు. ప్రసాద్ తాత ఇంటికి వస్తుండగా ఈ దారుణం చోటుచేసుకోవటంతో షాక్ అయ్యారు. ప్రసాద్ మృతితో కుటుంబ సభ్యుల, తాత ఇంట్లో అంతా విషాద ఛాయలు అలుముకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రసాద్‌ని చంపిన సంఘటనా స్థలాన్ని డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలతో పరిశీలించారు. హత్య జరిగిన తీరు, దీనికి గల కారణాలను పోలీసులు సేకరించారు. హత్య వేనుక ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా..? ఈ ఘటనకు అదే కారణమా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్త ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తర్వాత ప్రసాద్ డెడ్ బ్యాడీని కుటుంబ సభ్యులను అప్పగించారు
ఇది కూడా చదవండి: అల్లం టీలో రెండు పదార్థాలు కలిపి తాగండి... ఆ సమస్యల్ని పరార్