/rtv/media/media_files/2024/11/15/snake3.jpeg)
/rtv/media/media_files/2024/11/15/snake2.jpeg)
భారతీయ సంస్కృతిలో పాములను దేవతలుగా కొలుస్తారు. పాములను శక్తివంతంగా పరిగణిస్తారు. ఎవరైనా పాముకు ఏదైనా హాని తలపెడితే అది పగ తీర్చుకుంటుందని అంటుంటారు. పాముల గురించి చాలా కథలు వినిపిస్తుంటాయి. నిజంగానే పాము పగ తీర్చుకుంటుందా?
/rtv/media/media_files/2024/11/15/snake1.jpeg)
పాములకు జ్ఞాపకశక్తి చాలా తక్కువ. అవి ప్రధానంగా వాటి ఇంద్రియాలపై ఆధారపడి పనిచేస్తుంటాయి. పాములు ఏవీ గుర్తుంచుకోలేవు, ఎవరినీ గుర్తుపెట్టుకోలేవని నిపుణులు అంటున్నారు.
/rtv/media/media_files/2024/11/15/snake5.jpeg)
పాములు ఒకదానితో ఒకటి కమ్యూనికేషన్ కోసం ఫెరోమోన్లను ఉపయోగిస్తాయి. ఒక పామును చంపినప్పుడు అది కొన్ని రకాల ఫెరోమోన్లను విడుదల చేస్తుంది. ఈ ఫెరోమోన్లు ఇతర పాములకు అక్కడ ప్రమాదం ఉందని సూచిస్తాయి.
/rtv/media/media_files/2024/11/15/snake7.jpeg)
శాస్త్రీయ దృక్కోణంలో పాములకు ప్రతీకారం తీర్చుకునే ధోరణి లేదు. అవి తమను తాము రక్షించుకోవడానికి లేదా ఆహారం కోసం మాత్రమే దాడి చేస్తాయి. అయితే పాములకు అతీంద్రియ శక్తులు ఉంటాయని కొందరు నమ్ముతారు.
/rtv/media/media_files/2024/11/15/snake6.jpeg)
సైన్స్ ప్రకారం పాములు వాటి ప్రవృత్తిని బట్టి మాత్రమే పనిచేస్తాయి. అయితే పాములకు సంబంధించిన ఎన్నో కథలు పురాణాల్లో ఉన్నాయి.
/rtv/media/media_files/2024/11/15/snake4.jpeg)
వాస్తవానికి పాము కాటుకు గురైన ఐదుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో చాలా మంది పాము పగబట్టిందంటూ భావిస్తారు. ఓ ఘటనలో అటవీశాఖ అధికారులు ముగ్గురిని కరిచింది ఒకే పాము కాదని గుర్తించారు.