మనుషులను చంపేస్తున్న మూఢనమ్మకాలు.. పాముకాటు తర్వాత ఇలా చేస్తే అంతే సంగతి!

పాముకాటు మరణాలలో భారత్‌ ప్రపంచంలోనే టాప్‌లోనే ఉంది. దాదాపు ఏటా 30 లక్షల మంది పాముకాటుకు గురి అవుతుండగా.. వీరిలో సుమారు 58,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
snake6

Snakes

Snakes: పాము కాటుకు గురైన 15-20 నిముషాల నుంచి విషం ప్రభావం శరీరంలో కనిపించడం మొదలవుతుంది. అంటే పాము కాటేసిన వెంటనే చికిత్స తీసుకోవడం చాలా అవసరం. లేకపోతే ప్రాణాలే పోతాయ్. అయితే దేశంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ మూఢనమ్మకాలే ప్రజల చావులకు కారణమవుతున్నాయి. పాము కాటు తర్వాత చికిత్స విషయంలో ఇప్పటికీ పలు గ్రామాల ప్రజలు మూఢనమ్మకాలనే అనుసరిస్తున్నారు. పాము కాటు తర్వాత బాధిత వ్యక్తిని గంగానదిలో ముంచితే అతని శరీరంలో నుంచి విషం పోతుందనే భావన ఉత్తరప్రదేశ్‌లోని పలు గ్రామాల్లో కనిపిస్తోంది. హాపూర్ జిల్లా- సదర్‌పూర్ గ్రామంలో పాము కాటు తర్వాత బాధితులను గంగానదిలో ముంచుతారు. 

గంటల పాటు నీటిలో..

బులంద్‌షహర్‌లోని జహంగీరాబాద్ పట్టణంలో మోహిత్ కుమార్‌ అనే వ్యక్తిని పాము కాటేసింది. దీంతో అతని కుటుంబ సభ్యులు మోహిత్ మృతదేహాన్ని గంగా నదిలో ముంచారు. అక్కడ వరద ఉధృతికి మోహిత్ కుమార్‌ శరీరంలో నుంచి విషం బయటకు పోతుందని భావించారు. గంటల పాటు నీటిలో అతని కాళ్లు నానుతూనే ఉన్నాయి. చివరికు మోహిత్ చనిపోయాడు.

ఇది కూడా చదవండి: ప్రధాని మోదీకి ఇష్టమైన పండు..ఇది తింటే రోగాలు పరార్‌


 ఇలాంటి మూఢనమ్మకాల కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని గ్రామాల్లో పాము కాటుకు ప్రజలు మరణించడం సర్వసాధారణంగా మారిపోయింది. పాము కాటేసిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ప‌ర్వత‌ ప్రాంతాల్లోని ఆవు పేడ‌ల‌ను తీసుకొచ్చి అందులో బాధితులను పూడ్చిపెడతారు. ఆవుపేడ‌లో అనేక ఔష‌దాలు ఉంటాయని, పాముకాటు నుంచి విషాన్ని బ‌య‌ట‌కు లాగేస్తుంద‌ని అక్కడి ప్రజలు నమ్ముతారు. అయితే ఇలా ఆవుపేడ‌తో బాధితుల శ‌రీరాన్ని పూర్తిగా క‌ప్పడం కారణంగా వారు ఊపిరాడ‌క చనిపోతుంటారు. నిజానికి పాముకాటు మరణాలలో భారత్‌ ప్రపంచంలోనే టాప్‌లోనే ఉంది. దాదాపు 30 లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు. వీరిలో సుమారు 58,000 మంది ఏటా ప్రాణాలు కోల్పోతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

ఇది కూడా చదవండి: ఎన్నిసార్లు స్నానం చేసినా ఈ భాగాల్లో వాసన పోదు

 

ఇది కూడా చదవండి:  తిరుపతి ముంతాజ్ హోటల్స్‌ను రద్దు చేస్తారా? టీటీడీ ఛైర్మన్ ఏమన్నారు?

ఇది కూడా చదవండి:  విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Symptoms : జాగ్రత్త బాడీలో వాటర్ శాతం తక్కువుంటే.. ఈ లక్షణాలు కనబడతాయి

మానవ శరీరంలో 60శాతం వాటర్ పర్సెంట్ ఉండాలి. ఇంతకంటే తక్కుంటే డీహైడ్రేషన్‌తోపాటు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. పెదాలు, నోరు ఆరిపోవడం, పసుపురంగులో మూత్రం, తలతిరగడం, అలసట, తలనొప్పి వంటి లక్షణాలు శరీరంలో నీరు తక్కువుంటే కనిపిస్తాయి.

New Update
low water content

low water content

శరీరానికి తగినంత నీరు అందించాలి. ఆహారం తీసుకోకుండా అయినా.. కొన్ని రోజులు ఉండగలమేమో కానీ, నీళ్లు తాగకుండా వేసవిలో ఎక్కవ సేపు ఉండలేం. అసలే వేసవి.. సాధరణ రోజుల్లో కంటే ఎండాకాలంలో కస్త ఎక్కవ నీళ్ళు తాగాలి. పురుషులు అయితే రోజుకు 3.7 లీటర్ల నీళ్లు తాగాలి. అదే స్త్రీలు 2.7 లీటర్ల నీళ్లు తాగాలి. శరీరంలో 60శాతం వాటర్ ఎప్పుడు ఉండేట్లు చూసుకుంటే మన ఆరోగ్యం సురక్షితం. మీ బాడీలో వాటర్ పర్సెంట్ తగ్గింది అంటే అది మీకు చాలా డేంజర్. డీహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతే కాదు దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులకు దారితీస్తోంది. అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. మీరు రోజు పని హడావిడిలో పడి సరిగ్గా నీళ్లు తాగరు. మీ శరీరంలో వాటర్ పర్సెంట్ తక్కువగా ఉందంటే మీకు ఈ లక్షణాలు కనిపిస్తాయి.

Also Read:  పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?

Also Read :  కొడుకునే పెళ్లి చేసుకున్న స్టార్ నటి.. ఒక బిడ్డను కూడా కన్నారు

Low Water Content In Body

దాహం: ఇది బాడీకి లిక్కిడ్స్ అవసరం అని చెప్పే ఓ ప్రాథమిక సంకేతం. 
పసుపు రంగులో మూత్రం: మీరు రోజూ సరిపడ నీళ్లు తాగట్లేదంటే.. మీ యూరిన్ ముదురు పసుపు రంగులో వస్తోంది. అలాగే మూత్రం తక్కువగా కూడా వస్తోంది.
నోరు, పెదవులు పొడిబారడం: డీహైడ్రేషన్ వల్ల నోరు పొడిబారడం, పెదవులు పొడిబారడం, పగిలిపోవడం జరుగుతుంది. 
అలసట, బలహీనత: హైడ్రేషన్ లేకపోవడం వల్ల అలసట, సాధారణ బలహీనత కలుగుతుంది. 
తలతిరగడం: నిర్జలీకరణం రక్తపోటును ప్రభావితం చేస్తుంది. తలతిరగడం లేదా తలతిరగడానికి దారితీస్తుంది. 
తలనొప్పి: సాధారణ తలనొప్పి అనేది డీహైడ్రేషన్ మొదటి లక్షణం. 
పొడి చర్మం: నిర్జలీకరణం వల్ల చర్మం పొడిగా, నీరసంగా మారుతుంది. 
కండరాల తిమ్మిరి: నిర్జలీకరణం కండరాల తిమ్మిరి మరియు దుస్సంకోచాలకు దోహదం చేస్తుంది. 
చిన్న పిల్లల్లో అయితే వాటర్ శాతం తక్కువంటే ఏడుస్తున్నప్పుడు కనీళ్లు రావు.

Also Read :  ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగితే గుండె పోటు.. షాకింగ్ విషయాలు!

Also Read :  పెళ్లి కార్డుపై మహేశ్ బాబు ఫోటో.. ఇదెక్కడి అభిమానం రా సామీ!

(telugu-health-tips | water content | symptoms | dehydrate | dehydration | summer-tips | latest-telugu-news)

 

Advertisment
Advertisment
Advertisment