Sleeping: రాత్రి తినకుండా పడుకుంటే ఇన్ని రోగాలు వస్తాయా..?

రాత్రి భోజనం మానేయడం వల్ల కొన్నిసార్లు కడుపు నొప్పి, శక్తి లేకపోవడం, పోషకాహార లోపం, నిద్రలేమి వంటి సమస్యతోపాటు అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. అందుకని రాత్రి భోజనానికి బదులు ఏదైనా తేలికగా తింటే అనేక సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది.

New Update
eating

Sleeping

Sleeping: రాత్రి భోజనం తేలికగా ఉండాలని పెద్దలు లేదా ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అంటే రాత్రిపూట తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినాలి. అలాగని రాత్రి భోజనం చేయకూడదని దీని అర్థం కాదు. చాలామంది బరువు తగ్గేందుకు రాత్రి అన్నం తినడం మానేస్తుంటారు. రాత్రి భోజనానికి బదులు ఏదైనా తేలికగా తిన్నా, ఆకలి వేయదు. రాత్రి భోజనం మానేయడం మంచిది కాదు. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. రాత్రి భోజనం మానేస్తే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

కడుపు నొప్పి:

రాత్రి భోజనం మానేయడం వల్ల కొన్నిసార్లు కడుపు నొప్పి వస్తుంది. ఖాళీ కడుపుతో ఉంటే గ్యాస్ ఏర్పడుతుంది. బరువు తగ్గాలనే ఉద్దేశ్యంతో రాత్రి భోజనం మానేస్తే దానికి బదులు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇవి సులభంగా జీర్ణమవుతాయంటున్నారు.

శక్తి లేకపోవడం:

  • రోజూ రాత్రి భోజనం చేయకపోతే శరీరంలో శక్తి లోపిస్తుంది. దీని కారణంగా శరీరం లోపల నుంచి బలహీనపడటం ప్రారంభమవుతుంది. దీంతో అలసట, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. కొంతకాలం తర్వాత చాలా బలహీనంగా మారుతారు. మానసిక ఆరోగ్యంపైనా ప్రభావితం చూపుతుంది. ఒత్తిడి, ఆందోళన సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పోషకాహార లోపం:

  • ప్రతిరోజూ రాత్రి భోజనం మానేస్తే శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. దీనివల్ల మీ శరీరంలో చక్కెర శాతం తగ్గుతుంది. అలాగే రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది. దీనివల్ల శరీరం అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.

నిద్రలేమి సమస్య:

  • ఖాళీ కడుపుతో పడుకుంటే నిద్రపై ప్రభావం చూపుతుంది. తినకుండా పడుకుంటే రాత్రి ఆకలి ఎక్కువై నిద్ర పట్టదు. దీనివల్ల డిప్రెషన్‌తో పాటు గ్యాస్ట్రిక్‌ సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. అందుకే కొంచెమైనా తిని పడుకుంటే బాగా నిద్రపడుతుందని సూచిస్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఇది తింటే గడ్డకట్టే చలిలో కూడా వణుకు ఉండదు

 

Advertisment
Advertisment
తాజా కథనాలు