Dasara: దసరా రోజు జమ్మిచెట్టును పూజిస్తే కలిగే లాభాలు హిందూ మతంలో పూజ్యమైన, పవిత్రంగా భావించే మొక్కల్లో జమ్మిచెట్టు ముందు వరుసలో ఉంటుంది. దసరా రోజున జమ్మి చెట్టును ఎక్కువగా పూజిస్తారు. సంపదకు దేవుడు అయిన కుబేరుడు దసరా రోజున రఘు రాజుకు బంగారు నాణెం ఇచ్చిన తర్వాత జమ్మి ఆకులను బంగారంగా మార్చాడని నమ్ముతారు. By Vijaya Nimma 11 Oct 2024 | నవీకరించబడింది పై 12 Oct 2024 06:15 IST in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Prosopis Cineraria షేర్ చేయండి Dasara 2024: మత గ్రంధాల ప్రకారం.. జమ్మి మొక్క చాలా పూజ్యమైనది. ఎంతో పవిత్రమైనది. జమ్మి వృక్షాన్ని సంపదకు చిహ్నంగా భావిస్తారు. దసరా రోజున జమ్మి చెట్టును ఎక్కువగా పూజిస్తారు. హిందూ మతంలో పూజ్యమైన, పవిత్రంగా భావించే మొక్కల వరుసలో జమ్మిచెట్టు ఉంటుంది. దసరా పండుగ సందర్భంగా జమ్మిచెట్టును ప్రత్యేకంగా పూజిస్తారు. సంపదకు దేవుడు అయిన కుబేరుడు దసరా రోజున రఘు రాజుకు బంగారు నాణెం ఇచ్చిన తర్వాత జమ్మి ఆకులను బంగారంగా మార్చాడని నమ్ముతారు. అందుకే ఈ రోజున జరిగే జమ్మి పూజకు విశేష ప్రాముఖ్యత ఉంది. శని దోషం నుంచి ఉపశమనం.. అంతే కాకుండా మహాభారత కాలంలో పాండవులు కూడా జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను దాచి విజయం సాధించారని చెబుతారు. అందుకే దసరా సమయంలో జమ్మిని పూజిస్తారు. దసరా రోజున ఆచారాల ప్రకారం జమ్మి చెట్టును పూజిస్తే అన్ని రంగాలలో విజయం సాధించడంతో పాటు సంపద కూడా వృద్ధి చెందుతుందని నమ్మకం. దసరా రోజు ఇంట్లో ఒక జమ్మిచెట్టు నాటితో ఎంతో మంచిదని పెద్దలు చెబుతున్నారు. శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి తన జాతకంలో శని దోషం ఉన్నట్లయితే లేదా జీవితంలో శని దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్నట్లయితే జమ్మిచెట్టును పూజించాలి. పాజిటివ్ ఎనర్జీ ఉండేలా.. శని దోషం నుంచి ఉపశమనంతో పాటు దుష్ప్రభావాలను దూరం చేస్తుంది. కుటుంబంలోని ఎవరైనా తాంత్రిక మంత్రాల ప్రభావంలో ఉంటే దసరా రోజు జమ్మిని పూజించాలి. ఇది మంత్రాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చేస్తుంది. దసరా పండుగ రోజున జమ్మిని పూజించడం ద్వారా జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయి. ఇంట్లో కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉండవచ్చు, అంతేకాకుండా ఎనలేని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: జుట్టు నల్లబడటానికి ఆయుర్వేద మార్గాలివే #dasara మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి