/rtv/media/media_files/2025/02/25/7SExqfj28loY8P4SNLer.jpg)
Pancharama Kshetras Photograph: (Pancharama Kshetras)
Maha Shivaratri: దేశంలో పంచారామాలు పవిత్రమైన శైవ క్షేత్రాలు. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై మొత్తం ప్రదేశాల్లో పడిందని, వాటినే పంచారామాలు అని అంటారు. ఈ పవిత్రమైన పంచారామాలు ఏపీలో ఉన్నాయి. మరి వీటి ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.
Also Read: TG JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 50 వేల ఉద్యోగాలకు సీఎం గ్రీన్ సిగ్నల్!
ద్రాక్షారామం
ఈ ఆలయాన్ని చాళుక్యులు నిర్మించారని చెబుతుంటారు. ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడకు సమీపంలో ఉంది. ఈ ఆలయానికి కార్తీకం, మహా శివరాత్రికి భక్తులు ఎక్కువగా వెళ్తుంటారు.
అమరారామము
ఇక్కడ అమరేశ్వరుడిగా శివుడు పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ స్పటిక లింగం 60 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ శివలింగానికి రెండవ అంతస్తు నుంచి అభిషేకాలు నిర్వహిస్తారు. గుంటూరు జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది తీరంలో ఉంది.
Also Read: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే
క్షీరారామము
11వ శతాబ్దంలో చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. రెండున్నర అడుగుల ఎత్తులో ఉండే ఈ శివలింగాన్ని రామలింగేశ్వర స్వామిగా కొలుస్తారు. త్రేతా యుగంలో సీతారాములు ఇక్కడ లింగాన్ని ప్రతిష్టారని చెబుతుంటారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఈ క్షీరారామం ఉంది. భూమిపై శివుడు బాణం వదిలినప్పుడు భూమి నుంచి క్షీరదార వచ్చిందట. అందుకే ఆ ఆలయాన్ని క్షీరారామం అంటారని పురాణాలు చెబుతున్నాయి.
సోమారామము
ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించాడని, అందుకే సోమారామము అనే పేరు వచ్చిందని చెప్పుకుంటారు. రాజరాజేశ్వరి దేవిగా ఇక్కడి శివలింగానికి ఓ ప్రత్యేకత ఉంది. సాధారణ రోజుల్లో తెలుగు, నలుపు రంగులో శివలింగం ఉంటుంది. కానీ అమావాస్య రోజున గోధుమ వర్ణంలో ఉంటుంది. మళ్లీ పౌర్ణమికి మారుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ సోమారామము ఉంది.
Also Read: Breaking News : కాంగ్రెస్ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు!
కుమార భీమారామం
ఇక్కడ శివలింగం 60 అడుగుల ఎత్తులో ఉంటుంది. తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోటకు సమీపంలో ఈ ఆలయం ఉంటుంది.
Also Read: TS: నిర్మల్ కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీస్ స్వాధీనం..కోర్టు ఆదేశాలు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు కోసం దీనికి సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.