/rtv/media/media_files/2025/02/26/obesity4-828186.jpeg)
నేటి కాలంలో చాలా మంది ఊబకాయం బారినపడుతున్నారు. బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్నిసార్లు బరువు తగ్గడం చాలా కష్టం అవుతుంది.
/rtv/media/media_files/2025/02/26/obesity7-776169.jpeg)
ఉదయం దినచర్య ఆరోగ్యంగా ఉంటే మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన దినచర్యలు మనసుకు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన శరీరానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.
/rtv/media/media_files/2025/02/26/obesity8-631033.jpeg)
దినచర్యలో కొన్ని సాధారణ బరువు తగ్గించే అలవాట్లను చేర్చుకోవడం వల్ల కొవ్వును వేగంగా కరిగించవచ్చు. అల్పాహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉదయం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం వల్ల బరువు తగ్గవచ్చు.
/rtv/media/media_files/2025/02/26/obesity6-883434.jpeg)
బరువు తగ్గడానికి ప్రోటీన్ చాలా ముఖ్యమైనది కాబట్టి ఎప్పుడూ అల్పాహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. ఇది మీకు చాలా సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.
/rtv/media/media_files/2025/02/26/obesity9-825383.jpeg)
శక్తిని కూడా ఇస్తుంది. ఆరోగ్యం కోసం మంచి నిద్ర చాలా అవసరం. ఎంతసేపు నిద్రపోతున్నారనే దానికంటే ఎప్పుడు మేల్కొంటున్నారనేది ముఖ్యం. ఉదయాన్నే నిద్ర లేవడం మంచిది. బాగా నిద్రపోకపోతే బరువు తగ్గడంలో ఇబ్బంది పడవచ్చు.
/rtv/media/media_files/2025/02/26/obesity5-807535.jpeg)
బరువు పెరగడానికి తక్కువ నిద్ర ఒక ప్రధాన కారణం. ఇది ఆకలి హార్మోన్లను పెంచుతుంది. ఇది మీ బరువును పెంచుతుంది. అందుకే ఎప్పుడూ ఎనిమిది గంటలు బాగా నిద్రపోవాలి.
/rtv/media/media_files/2025/02/26/obesity1-135384.jpeg)
బరువు తగ్గాలనుకుంటే పుష్కలంగా నీరుతాగాలి. హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల జీర్ణక్రియ వేగంగా ఉంటుంది. జీవక్రియ పెరుగుతుంది. బరువును అదుపులో ఉంచుతుంది.
/rtv/media/media_files/2025/02/26/obesity3-509631.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.