ఈ గ్రామంలో ఎవరింట్లోనూ పొయ్యి వెలిగించరు.. కారణమేంటో తెలుసా?

గుజరాత్‌లోని చందన్‌కీలో ప్రతి ఇంట్లో ఎవరూ వండుకోరు. గ్రామ సర్పంచ్ పూనంబహాయి పటేల్ ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్‌లోనే అందరూ భోజనం చేస్తారు. యువత ఉద్యోగాలకు పట్టణాలకు వెళ్లడం వల్ల వృద్ధులు పడుతున్న ఇబ్బందిని చూడలేక పూనంబహాయి ఈ హాల్‌ను ఏర్పాటు చేశారు.

New Update
senior citizens

సాధారణంగా గ్రామాల్లో భోజనాలు ఉంటే ఎవరూ ఇంట్లో వండుకోరు. కానీ గుజరాత్‌లోని చందన్‌కీ గ్రామంలో ఏడాదిలో ఒక్కరోజూ కూడా ఇంట్లో వండుకోరు. ఈ గ్రామం మొత్తానికి కలిపి ఉన్న కమ్యూనిటీ హాల్‌లోనే అందరూ తింటారు. చిన్న గ్రామమైన చందన్‌కీలో 250 మందికి పైగా మాత్రమే జనాభా ఉంటారు. ఈ జనాభాలో ఎక్కువగా సీనియర్ సిటిజన్లు ఉండగా.. మిగిలినవారిలో యువత ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్లిపోయేవారు. 

సంప్రదాయ గుజరాతీ భోజనం

వృద్ధులు వారు రోజువారీ పనులు చేయలేక ఇబ్బంది పడేవారు. వీరి ఇబ్బందిని గమనించిన ఆ గ్రామ సర్పంచ్ పూనంబహాయి పటేల్ అందరికీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. గ్రామంలో ఉన్నవారంతా కలిసి ఒకేసారి భోజనం చేస్తారు. ఇక్కడ రోజుకి రెండు పూటలు మాత్రమే భోజనం పెడతారు. ఒక్కో వ్యక్తి నెలకు 2000 రూపాయలు చెల్లిస్తే.. గుజరాతీ భోజనాన్ని అందిస్తారు. ఈ కారణంతో గ్రామంలోని ఒక్క కుటుంబం కూడా ఇంట్లో వండుకోరు. ఈ కమ్యూనిటీ హాల్‌లోనే భోజనం చేస్తారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఇంట్లోనే ఎండు ద్రాక్షను తయారు చేసుకోవడం ఎలాగంటే?

ఒక పాత్రలో నీళ్లు తీసుకుని మరిగించాలి. ఇందులో కేజీ ద్రాక్ష పండ్లను వేసి ఉబ్బినంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత వడబోసి కాటన్ క్లాత్‌లో వేసి ఎండలో ఆరబెట్టాలి. ఇలా నాలుగు రోజుల పాటు ఆరబెడితే హోమ్ మేడ్ కిస్‌మిస్ రెడీ.

New Update
raisins making

raisins making Photograph: (raisins making)

కిస్‌మిస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. అయితే వీటిని స్వీట్లు, తీపి పదార్థాలు ఇలా ప్రతీ దాంట్లో కూడా వేస్తారు. మరికొందరు వీటిని నానబెట్టి పరగడుపున తింటారు. అయితే మార్కెట్‌లో దొరికే కిస్‌మిస్‌లో కల్తీ ఉంటుంది. వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎలాంటి కల్తీ లేకుండా సహజంగా ఇంట్లోనే కిస్‌మిస్‌ను ఈజీగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం.

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ద్రాక్ష పండ్లు మునిగేంత వరకు..

కిస్‌మిస్‌ను తయారు చేయడానికి కేజీ ద్రాక్ష, నీరు ఉంటే సరిపోతుంది. ఒక వెడల్పు ఉన్న గిన్నెలో ద్రాక్ష పండ్లు వేసి, మునిగేంత వరకు నీళ్లు, ఉప్పు వేసి ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత వాటిని శుభ్రం చేసి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి సగానికి పైగా నీళ్లు వేయాలి. నీరు మరుగుతున్నప్పుడు శుభ్రం చేసుకున్న ద్రాక్ష వేసుకుని ఓ 5 నిమిషాల పాటు ఉడికించాలి. 

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

అవి కాస్త ఉబ్బిన వెంటనే స్టవ్​ ఆఫ్​ చేసి వెంటనే వడకట్టాలి. వీటిని కాటన్ క్లాత్‌లో వేసుకుని ఎండలో ఉంచాలి. రెండు లేదా ఆరు రోజుల వరకు ఎండలో ఉంచితే అవి ఎండుతాయి. వీటిపై ఎలాంటి దుమ్ము, ధూళీ పడకుండా ఉండటానికి పల్చటి క్లాత్ కప్పాలి. ​అంతే ఇక కిస్‌మిస్ రెడీ అయినట్లే.

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment