2024కి వీడ్కోలు చెప్పి.. 2025కి వెల్‌కమ్ పలికే సమయం వచ్చేసింది. దీంతో చాలా మంది తమ ఫ్రెండ్, ఫ్యామిలీ, గర్ల్‌ఫ్రెండ్‌కు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో తెగ సెర్చ్ చేసేస్తున్నారు. కొత్త సంవత్సరంలో ఇచ్చే సర్‌ప్రైజ్ గుర్తుండి పోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరి మీరు కూడా అలాంటి గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఇక్కడ కొన్ని ఐడియాలు ఉన్నాయి. తల్లిదండ్రులకు బెస్ట్ గిఫ్ట్ ముందుగా తల్లిదండ్రులకు గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలనుకునేవారికి కొన్ని ఐడియాస్ ఇక్కడ ఉన్నాయి. పేరెంట్స్‌కు భావోద్వేగ బహుమతి ఇవ్వాలనుకుంటే కుటుంబానికి సంబంధించిన ప్రత్యేక క్షణాలు, జ్ఞాపకాలను కలిగి ఉన్న ఫొటో ఆల్బమ్‌ను ఇవ్వవచ్చు. ఈ గిఫ్ట్ అనేది మీరు వారితో ఎంత సమయం గడిపారో వారికి గుర్తు చేస్తుంది. అంతేకాకుండా వారి మనస్సును తాకుతుంది. ఇది కాకుండా మీరు వారికి చక్కని కుషన్ లేదా వారి ఫోటోతో కూడిన మగ్ లేదా దానిపై ఒక మంచి కొటేషన్ రాసి కూడా ఇవ్వొచ్చు. అన్నదమ్ములకు బెస్ట్ గిఫ్ట్ అన్నదమ్ముల బంధంలో సరదాకి, విలాసానికి లోటు లేదు. మీరు వారికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే టీ-షర్టులు, మగ్‌లు లేదా ఫోన్ కేస్‌ల వంటి వాటిని ఎంచుకోవచ్చు. అంతేకాకుండా వారికి ఏమి ఇష్టమో అది తెలుసుకుని కూడా ఇవ్వొచ్చు. గర్ల్‌ఫ్రెండ్‌కు బెస్ట్ గిఫ్ట్స్ మీరు మీ గర్ల్ ఫ్రెండ్‌కు ఒక చక్కటి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇదే మంచి సమయం. ఆమెకు నచ్చినది ఏంటో ముందు తెలుసుకోండి. ముఖ్యంగా లేడీస్ బ్యూటీ ఐటెమ్స్‌పై ఆసక్తి చూపిస్తారు. కాబట్టి మీరు వారి స్కిన్ కేర్ ప్రొడెక్ట్స్, షాంపూ, హెయిర్ ఆయిల్, బాడీ లోషన్ లేదా ఇతర లగ్జరీ వస్తువులను కొని ఇవ్వొచ్చు. అదే సమయంలో మీరు రొమాంటిక్ డిన్నర్‌ను కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అది ఇంట్లో కలిసి వంట చేసినా లేదా సాయంత్రం వారికి ఇష్టమైన రెస్టారెంట్‌లో గడిపినా పర్వాలేదు. వృద్ధులకు బెస్ట్ గిఫ్ట్స్ వృద్ధులు నిర్దిష్ట వయస్సు తర్వాత సౌకర్యవంతమైన బహుమతులు ఎల్లప్పుడూ ఇష్టపడతారు. మీరు వారికి వెచ్చని శాలువా, మెత్తటి చెప్పులు, హాయిగా ఉండే శాలువా, వెచ్చని బట్టలు, బూట్లు, మసాజర్ మొదలైన వాటిని బహుమతిగా ఇవ్వవచ్చు. అంతే కాకుండా తమకు నచ్చిన రేడియో, పుస్తకం కూడా తమ ఇష్టానుసారం ఇవ్వవచ్చు.