Microplastics: బ్రెయిన్‌లో ప్లాస్టిక్ చెంచా.. డేంజర్ జోన్‌లో చూయింగ్‌గమ్ తినేవాళ్లు!

చూయింగ్ గమ్ తినే వారి శరీరంలో వందల మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ చేసిన సర్వేలో తేలింది. గ్రామ్ చూయింగ్ గమ్ దాదాపు 100 మైక్రోప్లాస్టిక్ ముక్కలను విడుదల చేస్తుందట. ఈ మైక్రోప్లాస్టిక్ లంగ్స్, లివర్ కంటే 30 రెట్లు బ్రెయిన్‌లో ఉన్నాయి.

New Update
plastic in human body

plastic in human body Photograph: (plastic in human body)

మీకు చూయింగ్ గమ్ నమిలే అలవాటు ఉంటే డేంజర్ జోన్‌లో ఉన్నట్టే. తాజాగా సైంటిస్టులు చేసిన అధ్యాయనంలో షాకింగ్ విషయాలు వెల్లడైయ్యాయి. చూయింగ్‌ గమ్‌ను నమిలినపుడు నోట్లోకి మైక్రోప్లాస్టిక్స్‌ విడుదలవుతాయని పరిశోధనలో తేలింది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయాలు బయటకొచ్చాయి. సంజయ్‌ మొహంతి మాట్లాడుతూ.. చూయింగ్‌ గమ్‌ ద్వారా శరీరంలోకి మైక్రోప్లాస్టిక్స్‌ వెళ్తున్నట్లు తాజా పైలట్‌ స్టడీ వెల్లడించిందని చెప్పారు. శాన్ డియాగోలో జరిగిన అమెరికన్ కెమికల్ సొసైటీ సమావేశంలో ఈ అధ్యయనం సమర్పించారు. అధికంగా చూయింగ్ గమ్ తినేవారికి ఓ ప్లాస్టిక్ చెంచా తయారు చేసే పరిమాణంలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయనే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (UCLA) పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో వివిధ బ్రాండ్‌ల చూయింగ్ గమ్‌ను నమిలిన వారి లాలాజల నమూనాలను విశ్లేషించారు. UCLAలో పీహెచ్‌డీ విద్యార్థిని లిసా లోవ్ పది వేర్వేరు గమ్ బ్రాండ్‌ల ఏడు చూయింగ్ గమ్ ముక్కలను తిన్నది. పరిశోధకులు ఆమె లాలాజలంపై రసాయన విశ్లేషణ చేశారు. ఒక గ్రాము చూయింగ్ గమ్ దాదాపు 100 మైక్రోప్లాస్టిక్ ముక్కలను విడుదల చేస్తుందని తెలిసింది. కొన్ని బ్రాండ్‌ల చూయింగ్ గమ్స్ వల్ల 600 కంటే ఎక్కువ మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి ప్రవేశిస్తున్నాయని వారు కనుగొన్నారు.  

Also read: Mosquitoes: మనిషి రక్తాన్ని విషంగా మార్చి.. దోమల్ని చంపే ప్రయోగంలో సైంటిస్టులు సక్సెస్

సంవత్సరానికి 180 చూయింగ్‌ గమ్‌లను నమిలితే 30,000 మైక్రోప్లాస్టిక్స్‌ విడుదలవుతాయని పరిశోధకులు చెప్పారు. సాధారణంగా వాడే సింథటిక్‌ గమ్‌లో పెట్రోలియం ఆధారిత పాలిమర్స్‌ ఉంటాయి. అయితే, దానిలో ప్లాస్టిక్స్‌ ఉన్నట్లు ప్యాకేజింగ్‌పై రాయరు. డెమెటియా ఉన్న రోగులలో ఈ మైక్రోప్లాస్టిక్స్ నిల్వలు 3–5 రెట్లు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే అధ్యాయనంలో మరో షాకింగ్ విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కాలేయం లేదా మూత్రపిండాలు వంటి ఇతర అవయవాల కంటే మెదడులో 30 రెట్లు ఎక్కువ ప్లాస్టిక్ కణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్త పరిశోధన ప్రకారం మానవ బెయిన్‌లోని మైక్రోప్లాస్టిక్స్ పరిమాణం ఓ చెంచా సైజ్‌లో ఉన్నాయట.

Also read: AIDS with drugs: కొంపముంచిన డ్రగ్స్ అలవాటు.. ఒకేసారి 10 మంది ఎయిడ్స్

Advertisment
Advertisment
Advertisment