/rtv/media/media_files/2025/03/26/YxBLPviaYdRrJrRMfgMc.jpg)
summer vacation hill station ideas
Life Style: వేసవిలో వెకేషన్ ప్లాన్ చేసే చాల మంది మంచు ప్రదేశాలు, హిల్ స్టేషన్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందడానికి ఈ ప్రదేశాలను ఎంచుకుంటారు. ఇలా సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేసేవారి కోసం ఇక్కడ కొన్ని అద్భుతమైన ప్రదేశాల జాబితా ఇవ్వబడింది. మార్చి, ఏప్రిల్ నెలలో ఈ ప్రదేశాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి..
సమ్మర్ వెకేషన్ కోసం హిల్ స్టేషన్స్
కూర్గ్
జలపాతాలు, పొగమంచు పర్వతాలు, కాఫీ తోటలకు కూర్గ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ట్రెక్కింగ్, క్యాంపింగ్, రివర్ రాఫ్టింగ్ వంటి కార్యకలాపాలను ఎక్స్ ప్లోర్ చేయవచ్చు. అక్టోబర్ నుంచి జూన్ వరకు కూర్గ్ సందర్శించడానికి ఉత్తమ సమయం.
మేఘాలయ
మేఘాలయ సందర్శించడానికి ఏప్రిల్ నెల ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో మరీ వేడిగా ఉండదు.. మరీ చల్లగా ఉండదు. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశం మంచి రిలాక్సేషన్.
డార్జిలింగ్
పశ్చిమ బెంగాల్‌లో ఉండే ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ టైగర్ హిల్ నుంచి సూర్యోదయం యొక్క అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చు. వేసవిలో డార్జిలింగ్ సందర్శించడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు.
/rtv/media/media_files/2025/03/26/D52CkF7VV8nkjfumK5a8.jpg)
సిమ్లా
చల్లని గాలిని, పర్వతాల పచ్చదనాన్ని ఇష్టపడేవారికి సిమ్లా ఒక మంచి ఎంపిక. ఏప్రిల్ నెలలో ఇక్కడ వాతావరణం చాలా రొమాంటిక్ గా ఉంటుంది. పచ్చని లోయలు, ప్రకృతి అందాలు మిమల్ని మంత్రముగ్దులను చేస్తాయి. ఇక్కడ వివిధ అడ్వెంచర్స్ గేమ్స్ కూడా ఎక్స్ ప్లోర్ చేయవచ్చు.
కాశ్మీర్
సమ్మర్ లో కాశ్మీర్ ని సందర్శించడం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ పచ్చని లోయలు, మంచు పర్వతాలు మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. పహల్గామ్, గుల్మార్గ్, సోనామార్గ్ వంటి అనేక ప్రదేశాలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి.
పచ్‌మఢి
ఏప్రిల్ లో ఖచ్చితంగా సందర్శించాల్సిన ప్రదేశాల్లో మధ్యప్రదేశ్‌లోని ఏకైక హిల్ స్టేషన్ అయిన పచ్‌మఢీ ఒకటి. ఇక్కడ కొండలపై కనిపించే పచ్చదనం పర్యటకులను ఉత్సాహపరుస్తుంది. అనేక జలపాతాలు, గుహలను చూడవచ్చు. పచ్‌మఢి రావడం ద్వారా ప్రకృతికి దగ్గరగా ఉన్నట్లు భావిస్తారు.
telugu-news | life-style | summer-vacation | summer vacation ideas