బీపీ, ఎసిడిటీ ఉన్నవారు వేరుశనగ తింటే ఏమవుతుందో తెలుసా? వేరుశనగలు ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ.. కొన్ని సమస్యలు ఉన్నవారు మాత్రం వీటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. By Archana 04 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 వేరుశనగలో ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇవి రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. అయితే వేరుశనగలు ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ.. కొన్ని సమస్యలు ఉన్నవారు మాత్రం వీటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఎలాంటి సమస్యలు ఉన్నవారు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 2/6 ఎసిడిటీ ఎసిడిటీ సమస్య ఉన్నవారు వేరుశగకు కాస్త దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంటే వేరుశనగ కడుపులో మలబద్దకాన్ని కలిగించే అంశాలను ప్రేరేపిస్తాయి. దీని కారణంగా కడుపు నొప్పి, గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. 3/6 అధిక బరువు అధిక రక్తపోటు ఉన్నవారు వేరుశనగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి శరీరంలో సోడియం స్థాయిలను పెంచుతాయి. దీని వల్ల రక్తపోటు మరింత పెరుగుతుంది. ఒకవేళ ఇలాంటి వారు వేరుశనగ తినాలనుకుంటే ఉప్పు లేకుండా తినడం మంచిది. 4/6 అధిక రక్తపోటు అధిక రక్తపోటు ఉన్నవారు వేరుశనగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి శరీరంలో సోడియం స్థాయిలను పెంచుతాయి. దీని వల్ల రక్తపోటు మరింత పెరుగుతుంది. ఒకవేళ ఇలాంటి వారు వేరుశనగ తినాలనుకుంటే ఉప్పు లేకుండా తినడం మంచిది. 5/6 యూరిక్ యాసిడ్ సమస్య సాధారణంగా వేరుశనగలోని అధిక ప్రోటీన్ కంటెంట్ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను మరింత పెంచుతుంది. కావున ఆర్థరైటిస్, హైపర్యూరిసెమియా వంటి సమస్యలు ఉన్నవారు వేరుశనగలను తమ ఆహారంలో పరిమితంగా తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితిలో వేరుశనగ తినడం వల్ల సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. 6/6 అలర్జీలు వేరుశనగ అంటే అలర్జీ ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి. లేదంటే దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అనాఫిలాక్సిస్ వంటి సమస్యలు అభివృద్ధి చెందే ప్రమాదం ఉంటుంది. #health-tips #health-benefits #peanuts మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి