/rtv/media/media_files/2025/03/20/3NJ6cy0uMnpJEgerGsqr.jpg)
Milind Deora on obesity
Milind Deora: శివసేన ఎంపీ, రాజ్యసభ్యుడు మిలింద్ దేవరా ప్రధాని మోదీ #Fight Obesity కార్యక్రమాన్ని అభినందించారు. ఇటీవలే ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం నిర్వహణపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఎంపీ దేవరా మాట్లాడుతూ.. ఒబెసిటీని కలిగించే అధిక చక్కర, కొవ్వు వంటి ఆహార ఉత్పత్తులపై ప్రభుత్వం అధిక పన్ను విధించాలని సూచించారు. అలాగే పిల్లలను లక్ష్యంగా చేసుకొని.. చేస్తున్న వాటి ప్రకటనలను నిషేధించాలని కోరారు. అమెరికా నుంచి సాంకేతిక దిగుమతులను ఆహ్వానించడంలో ఎలాంటి సమస్యలేదు. కానీ అక్కడి జీవనశైలిని, ఒబెసిటీకి కారణమై దిగుమతులను వ్యతిరేకిస్తాను అని చెప్పారు. "ప్రధానమంత్రి అభిప్రాయానికి అనుగుణంగా, భారతదేశాన్ని ఒబిసిటీ లేకుండా చేయడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Sena MP Milind Deora took the mic in Rajya Sabha. Called out the sugar trap. Urged the Health Minister to BAN ads targeting kids.
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) March 20, 2025
~ Bold stand. Right cause. Because Sugar is the new tobacco. Perfectly aligns with PM Modi's Anti-Obesity campaign👏🏼 pic.twitter.com/5EN8nrOdXx
ఎంపీ మిలింద్ ఇంకా మాట్లాడుతూ.. అమెరికాను ఉదాహరణగా తీసుకుంటే, అక్కడ ఒబిసిటీ అనేది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు. అది చాలా పెద్ద ఆర్ధిక సంక్షోభం కూడా. ప్రస్తుతం, అమెరికాలో 42% మంది పెద్దలు, 20% మంది పిల్లలు ఒబెసిటీ సమస్యతో బాధపడుతున్నారు. గత రెండు దశాబ్దాల్లో 30% పెరిగింది. అమెరికాలో ప్రతీ ఏడాది ప్రజలు ఒబేసిటీపై $1.4 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. అమెరికాలో ప్రతి మూడు మరణాలలో ఒకటి ఒబిసిటీ సంబంధిత వ్యాధుల వల్ల జరుగుతుంది. ఇది భారత్ కు ఒక సందేశం అనుకోవచ్చు. వెంటనే ఒబేసిటీపై చర్యలు తీసుకోవాలి అని సూచించారు.
భారతదేశంలో 5 సంవత్సరాలలో 23% కి పెరిగిన ఒబెసిటీ
"ప్రాథమిక ఆరోగ్య సర్వే డేటా ప్రకారం, భారతదేశంలో పురుషులలో ఒబెసిటీ 5 సంవత్సరాలలో 19% నుంచి 23% పెరిగింది. మహిళల్లో 21% నుంచి 24% పెరిగింది. గత 10 సంవత్సరాలలో అధిక బరువు ఉన్న పిల్లల సంఖ్య 60% పెరిగింది'' అనో మిలింద్ పేర్కొన్నారు. ''2030 నాటికి, భారతదేశంలో ఒబిసిటీకి సంబంధించి వ్యాధులపై చేసే ఖర్చు దేశ జిడిపిలో 1.6% కి చేరవచ్చు. అంటే ప్రతి సంవత్సరం 7 లక్షల కోట్ల రూపాయలు కావచ్చు. ఒబిసిటీ కేవలం ఆరోగ్య సమస్య కాదు, ఇదొక తీవ్రమైన ఆర్థిక సవాలు. దీని వల్ల భారతదేశం పురోగతిని అందుకోలేదు" అని అన్నారు.
life-style | latest-news | FightObesity
Also Read: నువ్వు సూపర్ అన్నయ్య.. నా జీవితానికి నువ్వే హీరో.. చిరుపై పవన్ ఎమోషనల్ ట్వీట్!