/rtv/media/media_files/2025/01/26/Mtsl8UR3Lwbb0iux4PVx.jpg)
watching reels side effects
Social Media: ఈ మధ్య చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. గంటల తరబడి సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. కొంత క్షణం కూడా ఫోన్ పక్కన పెట్టకుండా అదేపనిగా రీల్స్ స్క్రోలింగ్ చేయడంలో మునిగిపోతారు. అయితే తాజాగా పరిశోధనల్లో దీనికి సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. రీల్స్ ఎక్కువగా చూసే అలవాటు ఆరోగ్యానికి హానికరమని ఒక అధ్యయనం హెచ్చరించింది.
అధిక రక్తపోటు..
BMC జర్నల్ లో ప్రచురించిన ఓ అధ్యయనంలో రాత్రిళ్ళు అదేపనిగా రీల్స్ చూసేవారు అధిక రక్తపోటు, హైపర్టెన్షన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. రీల్స్ చూడడం అనేది తాత్కాలికంగా మానసిక ఉత్తేజాన్ని కలిగించినా.. గమనీయంగా ఈ అలవాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చైనా, హెబీ మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో రాత్రి సమయాల్లో రీల్స్ చూసే వారిలో యూత్, మధ్య వయసు వారికి అధిక రక్తపోటు రిస్క్ పెరుగుతున్నట్లు కనుగొన్నారు.
2023 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు చేపట్టిన ఈ పరిశోధనను , చైనాలోని 4,318 మంది యువకులు, మధ్య వయసు వారి సాంపిల్స్ ఆధారంగా నిర్వహించారు. ఇందులో చేసిన వైద్య పరీక్షల ఫలితాలు.. అదేపనిగా రీల్స్ చూడడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రమాదాలను వివరిస్తున్నాయి. అంతేకాదు రాత్రిళ్ళు రీల్స్ చూడడం ద్వారా నిద్రకు అంతరాయం ఏర్పడుతుంది. స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకు అవసరమయ్యే మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల నిద్ర రావడం కష్టంగా మారుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- స్క్రీన్ సమయాన్ని వీలైనంత వరకు తక్కువగా ఉండేలా చూసుకోండి.
- స్క్రీన్ చూసే సమయంలో బ్లూ లైట్ ఫిల్టర్లను ఉపయోగించండి.
- నిద్రకు ముందే చదవడం లేదా ధ్యానం చేయడం వంటి ప్రత్యామ్నాయ కార్యకలాపాలు ప్రయత్నించండి.
- నిద్రించే ముందు మీ పడక గదిని చల్లగా, నిశ్శబ్దంగా, చీకటిగా ఉంచండి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: USA: స్ట్రిక్ట్ గా అక్రమ వలసల చట్టం అమలు..పార్ట్ టైమ్ జాబ్ చేస్తే ఇంటికే..