Life Style: రాత్రి ఆలస్యంగా పడుకుంటే శరీరంలో 5 భయంకరమైన మార్పులు! ఊహించలేరు

రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల శరీరంలో తీవ్రమైన మార్పులు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. సరైన నిద్రలేకపోవడం హార్మోన్లు అసమతుల్యత, అధిక బరువు, మేధా శక్తి తగ్గిపోవడం, సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తుంది.

New Update
late night sleeping effects

late night sleeping effects

Life Style: నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ స్క్రీన్స్ ముందే గడిపే సమయం బాగా పెరిగిపోయింది. ఆఫీసుల్లో కంప్యూటర్లు, ఇంటికొస్తే ఫోన్లు ఇలా 24 గంటలు స్క్రీన్ల ముందే గడిపేస్తున్నారు. ముఖ్యంగా రాత్రిళ్ళు చాలా మంది ఫోన్లు చూస్తూ ఆలస్యంగా నిద్రపోవడం సాధారణమైంది. అయితే ఈ అలవాటు వల్ల శరీరంలో తీవ్రమైన మార్పులు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అంతేకాదు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. 

హార్మోన్లు అసమతుల్యత

రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవడం హార్మోన్ల సమతుల్యతకు దారితీస్తుంది.  ముఖ్యంగా మెలటొనిన్ (నిద్ర హార్మోన్), కోర్టిసోల్ (ఒత్తిడి హార్మోన్లు ) అసమతుల్యతకు గురవుతాయి. అలాగే పెరుగుదల,  పునరుత్పత్తిని నియంత్రించే హార్మోన్లు కూడా ప్రభావితమవుతాయి.  ఇది సంతానోత్పత్తి, జీవక్రియ మొదలైన సమస్యలకు దారితీస్తుంది. 

బరువు పెరగడం

రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. సరైన సమయంలో నిద్రపోకపోవడం శరీరంలో ఆకలి, కడుపు నిండుగా ఉందనే భావనను నియంత్రించే హార్మోన్లకు అంతరాయం కలిగిస్తుంది. ఇది అతిగా తినడం, అనారోగ్యంగా ఆహార ఎంపికలకు దారితీస్తుంది. అలాగే నిద్రలేమి కారణంగా శారీరక శ్రమ చేయాలనే ఆసక్తి తగ్గపోతుంది. దీనివల్ల శరీరంలో కేలరీలు పెరిగిపోయి బరువు పెరగడానికి కారణమవుతుంది. 

రోగనిరోధక శక్తి బలహీనం 

రాత్రిళ్ళు సరైన నిద్రలేకపోవడం శరీరంలో రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. తద్వారా శరీరంలో వైరసులతో పోరాడే సైటోకైన్‌ల ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో తరచుగా జలుబు, జ్వరాలు, ఇతర ఇన్ఫెక్షన్లతో బాధపడే అవకాశం ఉంటుంది. 

మేధస్సు పనితీరు బలహీనం 

నిద్రలేమి మేధస్సును ప్రభావితం చేస్తుంది.  దీనివల్ల ఆలోచనలను స్పష్టంగా చేయడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం కష్టం అవుతుంది. అలాగే పనిపై ఫోకస్ తగ్గిపోతుంది. సరైన నిద్ర ఉన్న మెదడు మరింత ఉత్సాహంతో పనిచేస్తుంది.

శక్తి తగ్గిపోవడం 

ఆలస్యంగా నిద్రపోవడం..  అలసట,  ఒత్తిడిని కలిగిస్తుంది.  రాత్రంతా మేల్కొని ఉండడం శరీరంలోని శక్తిని ఖర్చు చేస్తుంది.  దీనివల్ల రోజువారీ పనులను చేయడం కష్టంగా మారుతుంది. లేటుగా పడుకొని, లేటుగా లేవడం మానసిక, శారీరక ఆరోగ్యం రెండింటికీ మంచిది కాదు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Sobhita Dhulipala: పెళ్లి తర్వాత శోభిత ఫస్ట్ మూవీ షూటింగ్.. హీరో ఎవరంటే? ఫొటోలు వైరల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పరగడుపున ఈ ఎల్లో పండు తింటున్నారా.. మీ పని ఖతం

పరగడుపున అరటి పండ్లను తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలోని ఆమ్లం జీర్ణ సమస్యలను తెచ్చిపెడుతుంది. ఏదైనా టిఫిన్ చేసిన తర్వాత అరటి పండును తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. కాబట్టి పరగడుపున ఎప్పుడూ కూడా అరటి పండు అసలు తీసుకోవద్దు.

New Update
Health Tips : ఈ 5 అలవాట్లు మిమ్మల్ని రోజంతా యాక్టివ్ గా ఉంచుతాయి..అలసటను దూరం చేస్తాయి...!!

Morning

సీజన్‌తో సంబంధం లేకుండా అరటి పండ్లు లభిస్తాయి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని పోటాషియం, కాల్షియం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే చాలా ఈ అరటి పండును తింటుంటారు. కానీ పరగడుపున అరటి పండ్లను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే వీటిని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

జీర్ణక్రియపై ఒత్తిడి పడుతుందని..

అరటి పండ్లను ఉదయం అల్పాహారంలో తీసుకోవచ్చు. కానీ ఏం తినకుండా పరగడుపున అయితే అసలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అరటి పండు ఎక్కువగా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. పరగడుపున దీన్ని తీసుకుంటే జీర్ణక్రియపై ఒత్తిడి కలుగుతుంది. దీనివల్ల కడుపు సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అరటి పండ్లను ఉదయాన్నే తినవద్దు.

ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

ఏదో ఒకటి తిన్న తర్వాత అరటి పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం గుండె, కిడ్నీ ఆరోగ్యం, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తుందని నిపుణులు అంటున్నారు. రోజుకి ఒక రెండు అరటి పండ్లు తింటే శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. అలసట అంతా కూడా తొలగిపోతుందని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక

Advertisment
Advertisment
Advertisment