/rtv/media/media_files/2025/02/23/bIk96Oq63PRgosa9Ou2D.jpg)
arjuna tree bark
Life Style: ఆయుర్వేదంలో అనేక రకాల మూలికలను వివిధ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. వాటిలో ఒకటి అర్జున చెట్టు బెరడు. తెలుగులో దీనిని తెల్లమద్ది చెట్టు అంటారు.ముఖ్యంగా దీనిని గుండె సంబంధిత సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. అంతేకాదు ఈ బెరడు వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
గుండె ఆరోగ్యం..
అర్జున చెట్టు బెరడు( Arjuna Tree Bark) గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ బెరడుతో తయారు చేసిన టీ తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తుంది. అంతేకాదు రక్తపోటును నియంత్రించడంలో కూడా తోడ్పడుతుంది.
- అర్జున బెరడు మూత్రాశయ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మూత్రాశయంలో నొప్పి నుంచి ఉపశమనం అందిస్తుంది. అలాగే దీని చల్లని స్వభావం మూత్రవిసర్జన మంటను తగ్గిస్తుంది.
- చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతుంది. అర్జున బెరడులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను ఉంటాయి. ఇవి మొటిమలను నియంత్రించడంలో సహాయపడతాయి. టానింగ్, పిగ్మెంటేషన్ సమస్యలను తగ్గించడంలో తోడ్పడుతుంది.
- బ్రోన్కైటిస్, ఉబ్బసం, దగ్గు, ఇన్ఫెక్షన్లు వంటి ఊపిరితిత్తుల పరిస్థితులకు చికిత్స చేయడంలో అర్జున బెరడు సహాయపడుతుంది. అర్జున బెరడుతో తయారు చేసిన ఔషద టీ కఫమ్, శ్లేష్మాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.
అయితే అర్జున బెరడు కొంతమందిలో అలెర్జీలకు కారణం కావచ్చు. చర్మంపై దద్దుర్లు, దురద లేదా వాపు వంటివి ఉండవచ్చు. ఇలాంటి అలెర్జీ లక్షణాలను గమనించినట్లయితే, వెంటనే వాడటం మానేసి నిపుణుడిని సంప్రదించండి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.