Tablets: టాబ్లెట్స్‌కి జబ్బు ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? ఆనారోగ్య సమస్యతో వేసుకునే మందులో ఉండే రసాయనాలు కొన్ని రకాల రిసెప్టర్లకు మాత్రమే అతుక్కునేలా తయారు చేస్తారు. రిసెప్టర్ కేవలం దానికి సరిపోయే రసాయనాన్ని గ్రహిస్తుంది. శరీరం అంతటా మందు అన్ని భాగాల్లోకి ప్రవహించినా సమస్య దగ్గర దాని ప్రభావం చూపిస్తుందట. By Vijaya Nimma 05 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Tablets షేర్ చేయండి Tablets: నోటి ద్వారా వేసుకున్న మాత్రకు మన శరీరంలో ఎక్కడ సమస్య ఉందో ఎలా తెలుస్తుంది..? అనే డౌట్ అందరికీ వస్తుంటుంది. మనం వేసుకున్న ట్యాబ్లెట్‌కు ఏ పార్ట్ దగ్గరికి వెళ్లి పనిచేయాలో ఎలా తెలుస్తుంది. దీనిపై రకరకాల కామెడీ జవాబులు చెబుతున్నారు నెటిజన్లు. ట్యాబ్లెట్ చెవిలో మంత్రం చెప్పి పంపిస్తారని ఒకరు కామెంట్ చేస్తే, లోపలికి వెళ్లాక ట్యాబ్లెట్ గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుంటుందని ఇంకొకరు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. నిజంగా మనం వేసుకునే టాబ్లెట్స్ శరీరంలోకి వెళ్లాక ఎలా పనిచేస్తాయో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. ట్యాబ్లెట్ ఇలా పనిచేస్తుంది: ఆనారోగ్య సమస్యకు ఇచ్చిన మాత్రలు, మందులు, టానిక్.. నోటి ద్వారానే శరీరం లోపలికి చేరతాయి. ఆహారం తీసుకుంటే అదెలా ప్రయాణిస్తుందో మందు కూడా అదేవిధంగా జీర్ణాశయంలోకి చేరుకుంటుంది. అక్కడ విచ్ఛిన్నమై జీర్ణమైన మందులు రక్తంలో కలుస్తాయి. ఈ రక్తం చిన్న ప్రేగుల నుంచి హెపాటిక్ పోర్టల్ వెయిన్ అనే నాళం ద్వారా కాలేయానికి చేరుతుంది. కాలేయంలో శుద్ధి చేసిన రక్తమే శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా అవుతుంది. కాలేయంలో ఈ ట్యాబ్లెట్ తాలూకు సమ్మేళనాలు కూడా మరింత విచ్ఛిన్నం అవుతాయి. అవి మళ్లీ రక్త ప్రసరణలోకి చేరతాయి. ఇలా మందులు ఉన్న రక్తమే శరీరంలోని అన్ని భాగాలకూ, కణజాలాలకు ప్రవహిస్తుంది. దాంతో మందు కూడా ప్రతి భాగానికి చేరుకుంటుంది. అయితే వెళ్లిన ప్రతిచోటా ఈ మందు ప్రభావం చూపదు. ఇది కూడా చదవండి: ఈ సమస్యలు ఉంటే బంగాళాదుంప అస్సలు ముట్టుకోవద్దు సమస్య ఉన్నచోటే ఎలా పనిచేస్తుంది..? మన శరీరంలో ప్రొటీన్ అణువులుంటాయి. ఇవి కణాల ఉపరితలం మీద, కణాల లోపల కూడా రకరకాల ఆకారాల్లో విభిన్నంగా ఉంటాయి. మనం వేసుకున్న మందును గ్రహించేది ఇవే. మందులో ఉండే రసాయనాలు కొన్ని రకాల రిసెప్టర్లకు మాత్రమే అతుక్కునేలా తయారు చేస్తారు. అంటే రిసెప్టర్ కేవలం దానికి సరిపోయే రసాయనాన్ని మాత్రమే గ్రహిస్తుంది. శరీరం అంతటా మందు అన్ని భాగాల్లోకి ప్రవహించినా కూడా సమస్యకు సంబంధించిన గ్రాహకాలు ఎక్కడుంటే అక్కడ ఎక్కువగా పనిచేస్తుంది. దాని ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: ఒంటికి వాడే సబ్బును ఇంటికి వాడండి ఇలా #tablets మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి