/rtv/media/media_files/2025/01/02/grRiAMp2oICATHmX0uII.jpg)
horoscope 2025 today
మేష రాశి
పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా ఉంటాయి. నిరుద్యోగులకు అనుకూలం.
వృషభ రాశి
కొందరి ప్రవర్తన తలనొప్పి తెప్పిస్తుంది. ముఖ్యమైన పనుల్లో అడ్డంకులు వస్తాయి. వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు తప్పవు. మిత్రులతో గొడవలు జరగవచ్చు. ఖర్చులు పెరిగిపోతాయి.
మిధున రాశి
వాహనయోగం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఇది కూడా చూడండి: Nitin Gadkari: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
కర్కాటక రాశి
ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. కొత్త పనులు మొదలుపెడతారు. కీలక విషయాలు తెలుసుకుంటారు.
సింహ రాశి
ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ట్రాన్స్ ఫర్లు ఉంటాయి. కొన్ని సమస్యలు చికాకు తెప్పిస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య రాశి
కుటుంబ సభ్యులతో మనస్పర్థలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు తెప్పిస్తాయి. పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో గందరగోళ వాతావరణం ఉంటుంది. ఉద్యోగాల్లో సమస్యలు తప్పవు. పిల్లల చదువు విషయంలో శ్రద్ధ అవసరం.
ఇది కూడా చూడండి: PM Modi: శాంతి కోసం ప్రయత్నిస్తే..పాక్ నమ్మకం ద్రోహం చేసింది-ప్రధాని మోదీ
తులా రాశి
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. రాజకీయ సమావేశాలకు ఆహ్వానాలు అందుకుంటారు. పిల్లల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలం. ఆర్థికంగా బాగుంటుంది. పిల్లల చదువు, ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.
వృశ్చిక రాశి
ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా ఉంటాయి. కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతాయి. స్థిరాస్తి ఒప్పందాలు జరుగుతాయి.
ధనస్సు రాశి
పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. పనులు అనుకున్న టైంకి పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో అడ్డంకులు వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తప్పవు. సన్నిహితుల నుంచి ఊహించని మాటలు వింటారు.
ఇది కూడా చూడండి: Lovers suicide : ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..వారిద్దరూ ఏం చేశారంటే?
మకర రాశి
ఆర్థిక వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు ఉండవు. పనుల్లో అవాంతరాలు వస్తాయి. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు. నిరుద్యోగులకు అననుకూలం. ఆప్తులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు.
కుంభ రాశి
ఆదాయం పెరుగుతుంది. పనులు సజావుగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రశంసలు పొందుతారు. దైవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.
మీన రాశి
ఆస్తి వివాదాలు చికాకు తెప్పిస్తాయి. నిర్మాణ పనులు వాయిదా పడతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చూడండి: Kalyan Ram: విజయశాంతిని అలాగే పిలుస్తా.. అంతగా దగ్గరయ్యాం: కల్యాణ్‌రామ్ సంచలనం!