Jeans: ఇలా ఉతికితే జీన్స్ రంగు ఎప్పటికీ పోదు జీన్స్‌ను ఉతికే సమయంలో కాస్త అజాగ్రత్తగా ఉంటే రంగు పోతుంది. జీన్స్‌ను వేడి నీళ్లలో ఉతకకూడదు. చల్లని నీటిలోనే వాటిని ఉతకాలి. వేడి నీటిలో ఉతికితే తొందరగా రంగు పోతాయి. జీన్స్‌ను సూర్యకాంతిలో ఆరబెట్టవద్దు. ప్రకాశవంతమైన కాంతి కారణంగా దాని రంగు పోతుంది. By Vijaya Nimma 05 Dec 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 జీన్స్‌ను అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ వేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఉతికే సమయంలో కాస్త అజాగ్రత్తగా ఉంటే రంగు పోతుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మురికి కూడా వదలదు. 2/6 డీప్ బ్లాక్ లేదా నేవీ బ్లూ కలర్ జీన్స్ కలర్ లేతగా మారితే అవి అందంగా కనిపించవు. ఆకర్షణను కోల్పోతాయి. జీన్స్‌ను వేడి నీళ్లలో ఉతకకూడదు. ఎల్లప్పుడూ చల్లని నీటిలోనే వాటిని ఉతకాలి. ఎందుకంటే వేడి నీటిలో ఉతికితే తొందరగా రంగు పోతాయి. 3/6 జీన్స్‌ను ఉతికేటప్పుడు లోపలి భాగం పైకి ఉండేలా చేసి ఉతికితే రంగు పోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా లోపలి నుంచి శుభ్రంగా మారుతుంది. 4/6 జీన్స్‌ను ఉతికేటప్పుడు తేలికపాటి, బ్లీచ్ లేని డిటర్జెంట్ ఉపయోగించండి. హార్డ్ సబ్బు జీన్స్ ఫాబ్రిక్, రంగును కూడా దెబ్బతీస్తుంది. 5/6 జీన్స్‌ని పదే పదే ఉతకడం మానుకోండి. అవసరమైనంత వరకు మాత్రమే ఉతకాలి. మురికిగా లేకుంటే బహిరంగ ప్రదేశంలో తలక్రిందులుగా చేసి గాలికి ఆరేయవచ్చు. 6/6 జీన్స్‌ను నేరుగా సూర్యకాంతిలో ఆరబెట్టవద్దు. ప్రకాశవంతమైన కాంతి కారణంగా దాని రంగు వాడిపోవచ్చు. జీన్స్‌ను ఎప్పుడూ నీడలోనే ఆరనివ్వాలి. #jeans మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి