Cancer: క్యాన్సర్ వచ్చే ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి క్యాన్సర్ మాత్రమే కాకుండా ఏ వ్యాధి రావడానికి ముందైనా మన శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధి ప్రారంభారానికి ముందే నోటిలో పుండ్లు, నాలుకపై మచ్చలు, కడుపు సంబంధింత సమస్యలు వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 06 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Cancer షేర్ చేయండి Cancer: క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. దీని పేరు చెబితేనే ఎంతో మందికి భయం మొదలవుతుంది. ఏటా లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. చెడు జీవనశైలి, ఆహారం కారణంగానే క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే విజయవంతంగా చికిత్స చేయవచ్చు. అయితే దీని లక్షణాలను ఎంతో మంది గుర్తు పట్టలేరు. 90 శాతం మందికి అవి క్యాన్సర్ లక్షణాలు అని కూడా తెలియవు. అందుకే ప్రతి ఒక్కరూ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఎంటో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. నోటిలో పుండ్లు: నోటిలో తరచుగా పుండ్లు ఏర్పడడం అనేది సాధారణ విషయం కాదు. ఇది క్యాన్సర్ చూపించే లక్షణాలలో ఒకటి. దీన్ని ప్రీక్యాన్సర్ లక్షణంగా చెప్పుకుంటారు. దీనిని వైద్యులు స్టేజ్ జీరో అని పిలుస్తారు. ఇది కచ్చితంగా క్యాన్సర్ లక్షణమే అని చెప్పలేం. కానీ కొన్నిసార్లు మాత్రం అది క్యాన్సర్ వల్లే వచ్చే అవకాశం ఉంది. నాలుకపై మచ్చలు: నాలుకపై తెల్లని మచ్చలు కనిపిస్తే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇది కూడా స్టేజ్ జీరోలో కనిపించే సాధారణ లక్షణం. దీని వెనుక నోటి, ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. నాలుకపై తెల్లని మచ్చలు వస్తే ఒకసారి వైద్యుడిని సంప్రదించడం మంచిది. కడుపు సంబంధింత వ్యాధులు: తరచుగా కడుపు సంబంధిత వ్యాధులు వస్తున్నా కూడా తేలికగా తీసుకోకూడదు. తరచూ మలబద్ధకం వస్తున్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. తరచుగా ఈ సమస్య కనిపిస్తుంటే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: ఈ కాయలు తింటే మధుమేహం దరిచేరదు #cancer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి