Health Tips: కాళ్లు, చేతులు చల్లబడటం ఆ వ్యాధికి సంకేతమా..? ఉదయం లేవగానే కొందరిలో కళ్లు తిరగడం, పల్స్ పడిపోవటం, కాళ్లు, చేతులు చల్లబడడం లాంటివి జరుగుతుంటాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం వల్ల రక్తపోటు తగ్గడం కావడంతో ఇలా జరుగుతుందని చెబుతున్నారు. By Vijaya Nimma 15 Sep 2024 in లైఫ్ స్టైల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Health Tips: నేటికాలంలో ఆరోగ్యం పట్ల ఏ సమస్య వచ్చినా నిర్లక్ష్యం పనికిరాదు. ఎందుకంటే చిన్న నిర్లక్ష్యం వల్ల పెద్ద సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. అలాంటి వాటిల్లో కాళ్లు, చేతులు చల్లబడటం వంటి కూడా ఉంటాయి. కొందరిలో కళ్లు తిరగడం, పల్స్ పడిపోవటం, కాళ్లు, చేతులు చల్లబడుతున్నాయి. ఈ లక్షణాలు ఉంటే ఆందోళనకు గురికావటంతోపాటు లోబీపీ, హైపో టెన్షన్ తలెత్తుతుంది. అంతేకాదు.. శరీరంలోని అవయవాలకు సరిగ్గా రక్తం సరఫరా కాపోవడంతో అలసట, మైకం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఓ వ్యక్తికి హైపో టెన్షన్ ఉంటే రక్త ప్రసరణ విఫలం అవుతుంది. శరీరంలో ఉష్ణోగ్రత వల్ల అనేక మార్పులు వచ్చి కాళ్లు, చేతులు చల్లబడటం, పల్స్‌రేట్ పడిపోవడం వంటి సమస్యలు వస్తాయి.. అయితే ఈ సమస్యలు నెలలో 2,3 సార్లు వస్తే ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. అంతేకాదు లోబీపీ ఉన్నవాళ్లకు ప్రాణానికి హాని కూడా ఉంటుంది. అయితే శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం వల్ల రక్తపోటు తగ్గడం, లోబీపీ పెరుగుతుంది. అందుకని బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవటంతోపాటు ప్రతిరోజూ 8-10 గ్లాసులు నీరు తాగడం, పండ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. అంతేకాని ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ వంటివి ఎక్కువగా తీసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తాయి. లోబీపీ ఉన్నవాళ్ల ఆహారం తినే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రోజూలో నాలుగైదు సార్లు భోజనం చేయాలి. ఒకేసారి ఎక్కువ తినకూండా.. తక్కువ తీసుకుంటే బీపీ కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొందరిలో ఉదయం లేవగానే తల గిర్రున తిరిగినట్లు, మైకం కమ్మేసినట్లు, కళ్లు స్పష్టంగా కనబడవు, మనుషులు, వస్తువులు, పరిసరాలు సగం సగం కనిపించినట్లు ఉంటుంది. వీటన్నికి పెద్ద కారణం హైపోటెన్షన్. ఇది తగ్గాలంటే వ్యాయామాలు చేయాలి. అంతేకాకుండా సమస్య తగ్గేవరకు ఒకేచోట గంటల కొద్దీ కూర్చోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఏ సమయంలో అయినా.. అరికాళ్లు, అరచేతులు చల్లబడుతూ ఉంటే రక్తపోటు తగ్గుతున్నట్లు గుర్తు. మీకు వెంటనే తక్షణ ఉపశమనం కావాలంటే ఏసీ ఆఫ్ చేయాలి.. వెచ్చని దుస్తులు ధరించాలి. వీలైతే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి వెళ్తే మంచిది. లోబీపీ వల్ల సెప్సిస్ వంటి సమస్యలు వస్తాయి. దీంతో అవయవాల పనితీరు మందగించే అవకాశం ఉంటుంది. అందుకని ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా శాశ్వత పరిష్కారం మంచి వైద్యం తీసుకోవాలని వైద్య నిపుణులు చెడుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి