Children: ఉదయం స్కూల్‌కు వెళ్లేందుకు పిల్లలు నిద్రలేవకపోతే ఇలా చేయండి

పిల్లలను ఉదయాన్నే సిద్ధం చేయడం సవాల్‌తో కూడుకున్న పని. శుభ్రమైన, సౌకర్యవంతమైన దుస్తులలో నిద్ర వేగంగా వస్తుంది. పిల్లలను రాత్రిపూట తొందరగా నిద్రపోయేలా ప్రోత్సహిస్తే మంచిది. రాత్రి పడుకునే ముందు 30 నిమిషాల ముందు పిల్లలు తమ పనిని ముగించుకోవాలని చెప్పాలి.

New Update
Children

Children Photograph

Children: ఉదయాన్నే పాఠశాల సమయాలు చాలా మంది తల్లిదండ్రులకు సమస్యాత్మకంగా మారాయి. పిల్లలను ఉదయాన్నే సిద్ధం చేయడం సవాల్‌తో కూడుకున్న పని. పిల్లలకు 8 నుండి 9 గంటల నిద్ర చాలా ముఖ్యం. ఇది వారి ఆరోగ్యాన్ని బాగా ఉంచుతుంది. కాబట్టి రాత్రిపూట తొందరగా నిద్రపోయేలా ప్రోత్సహిస్తే మంచిది. రాత్రి పడుకునే ముందు కనీసం 30 నిమిషాల ముందు పిల్లలు తమ పనిని త్వరగా ముగించుకుని పడుకోవాలని చెప్పండి. పడుకునే ముందు 20 నిమిషాల ముందు పుస్తకాన్ని చదవడం అలవాటు చేయండి. 

బిడ్డ త్వరగా పడుకోవాలి:

అంతేకాకుండా ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చుకోండి. ఇంట్లో టీవీ, మొబైల్ మొదలైనవి ఆన్‌లో ఉంటే స్విచ్ ఆఫ్ చేయండి. ఇంట్లోని లైట్లు అన్నీ ఆఫ్ చేయండి. పిల్లవాడు భయపడకుండా బెడ్‌లైట్‌ వేయాలి. పిల్లలు పడుకునే ముందు టాయిలెట్‌కి వెళ్లేలా చేయండి. బిడ్డ త్వరగా పడుకోవాలని మీరు కోరుకుంటే కాళ్లు చేతులు కడుక్కున్న తర్వాతే పడుకునేలా చేయండి. పిల్లల పాదాలకు అప్పుడప్పుడు మసాజ్ చేయడం వల్ల అలసట త్వరగా తగ్గుతుంది.

పిల్లలను ఎప్పుడూ మురికి బట్టలతో పడుకోనివ్వకండి. శుభ్రమైన, సౌకర్యవంతమైన దుస్తులలో నిద్ర వేగంగా వస్తుంది.  దినచర్యను సెట్ చేయండి, ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోమని పిల్లలకి చెప్పండి. ఇలా చేస్తే పిల్లవాడు రెండు మూడు రోజుల్లో అలవాటు పడిపోతాడు. కాబట్టి, నిద్ర, మేల్కొనే సమయాన్ని సెట్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

గమనికఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ పండు తింటే వృద్దాప్యం తొందరగా రాదు.. శీతాకాలంలోనే దొరుకుతుంది

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

యంగ్ లుక్‌లో దర్శనమివ్వాలంటే.. అమ్మాయిలు ఈ 6 ఫుడ్స్ తీసుకోండి

వయస్సు పెరిగినా కూడా యంగ్ లుక్‌లో కనిపించాలంటే కొన్ని రకాల పండ్లను డైలీ డైట్‌లో చేర్చుకోవాలి. ముఖ్యంగా బొప్పాయి, పుచ్చకాయ, మామిడి, పైనాపిల్, కివి, నారింజను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు అన్ని కూడా క్లియర్ అవుతాయి.

New Update
Beauty

Beauty

వయస్సు పెరిగినా కూడా యంగ్ లుక్‌లో కనిపించాలని అమ్మాయిలు ఎక్కువగా కోరుకుంటారు. ఈ క్రమంలో యంగ్ లుక్‌లో కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే యంగ్ లుక్‌లో ఎల్లప్పుడూ కూడా కనిపించాలంటే తీసుకోవాల్సిన పండ్లు ఏవో చూద్దాం. 

బొప్పాయి

బొప్పాయిలో పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులోని పపైన్ అనే ఎంజైమ్ ముఖంపై మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తుంది.

ఇది కూడా చూడండి: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

పుచ్చకాయ
వేసవిలో లభ్యమయ్యే ఈ పండులో విటమిన్ సి, లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఎండ నుంచి కాపాడుతుంది. ఇందులోను కొల్లాజెన్ యంగ్ లుక్‌లో ఉండేలా చేస్తుంది.

మామిడి పండ్లు
వీటిలోని విటమిన్ ఎ, సి చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. అలాగే ముఖంపై ఉండే మొటిమలను తగ్గిస్తుంది.

ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

పైనాపిల్
ఇందులో విటమిన్, మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంపై ఉండే నల్ల మచ్చలను తగ్గించడంతో పాటు చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో బాగా సాయపడుతుంది.

కివి
ఈ పండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పర్యావరణ ఒత్తిళ్ల నుండచి చర్మాన్ని రక్షించడంలో కివి పండ్లు బాగా ఉపయోగపడుతుంది. 

ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

నారింజ
విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ వంటివి ఇందులో ఉంటాయి. ఇవి ఎండ నుంచి వచ్చే పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. డైలీ ఒక నారింజ పండు తింటే యంగ్ లుక్‌లో ఉంటారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు