/rtv/media/media_files/WAn0quuMBAOk08KvcxMS.jpg)
Hanumakonda Accident
Hanumakonda Accident: హనుమకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకొంది. క్రేన్ వెనుక నుంచి ఢీకొట్టడంతో సైకిల్‌పై వెళ్తున్న తండ్రి, కుమారుడు మృతి చెందారు. ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామానికి చెందిన తంగెడ రాజేశ్వరావు, లక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు సాగర్‌రావు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. చిన్నకుమారుడు వికాస్‌రావు (30) దివ్యాంగుడు కావడంతో ఇంటివద్దే తల్లిదండ్రులతో ఉంటున్నారు.
క్రేన్ ఢీకొని..
అయితే... సంవత్సరం కిందట రోడ్డు ప్రమాదంలో భార్య లక్ష్మి తీవ్రంగా గాయ పడ్డారు. పెద్ద కుమారుడి దగ్గర ఉంటూ ఆమె అక్కడే చికిత్స చేయించుకుంటున్నారు. స్వగ్రామంలో ఉంటున్న రాజేశ్వరరావు శుక్రవారం చిన్నకుమారుడితో కలిసి సైకిల్ మీద వల్లభాపూర్‌లో బంధువుల ఇంటికి వెళ్తున్నారు. హుజూరాబాద్ నుంచి హనుమకొండ వైపు వెళ్తున్న క్రేన్ వెనుక నుంచి వచ్చి సైకిల్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీ కుమారులిద్దరూ అక్కడికక్కడే మృతవాత పడ్డారు.
ఇది కూడా చదవండి: పొట్టిగా ఉన్నవారు బరువు తగ్గడంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు?
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని ఎల్కతుర్తి సీఐ పులి రమేశ్‌తోపాటు ఎస్‌ఐ ప్రవీణ్ పరిశీలించారు. క్రేన్ డ్రైవర్ దిల్‌షాద్ అహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: ఛాతీలో మంట, వికారం గుండెపోటుకు కారణమా?