Egg: రోజూ గుడ్డు తింటే వృద్ధాప్యంలోనూ మతిమరుపు ఉండదు పిల్లలు రోజూ ఒక గుడ్డు తినటం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి దృఢంగా ఉండాలంటే గుడ్లు తినాలి. దీనివల్ల మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, కణాల మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 25 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 గుడ్లు తినడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లలు రోజూ ఒక గుడ్డు తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గుడ్లలో చాలా పోషకాలు ఉంటాయి. 2/6 ముఖ్యంగా కోడిగుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలను బలోపేతం చేయడానికి, రిపేర్ చేయడానికి అవసరం. వృద్ధాప్యంలో కూడా జ్ఞాపకశక్తి దృఢంగా ఉండాలంటే గుడ్లు తినాలని తాజా పరిశోధనలో వెల్లడైంది. 3/6 వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో గుడ్లు ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. గుడ్లు అధిక మొత్తంలో ఆహార కొలెస్ట్రాల్‌ను కలిగి ఉంటాయి. 4/6 పెద్దలలో మెదడు పనితీరులో మార్పులపై గుడ్డు వినియోగం ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. గుడ్లలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. కానీ జ్ఞాపకశక్తిని పెంచడానికి ఇందులోని కోలిన్ బాగా పనిచేస్తుందంటున్నారు. 5/6 కోలిన్ జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, కణాల మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తుంది. 6/6 గుడ్లలో విటమిన్లు B6, B12, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి మెదడు కుంచించుకుపోకుండా, జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. #egg మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి