టీతో సిగరెట్ తాగితే ఎంత ప్రమాదమో మీకు తెలుసా? టీతో కలిపి సిగరెట్ తాగడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదాలు, క్యాన్సర్, జీర్ణ సమస్యలు, బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా టీతో కలిపి సిగరెట్ తాగవద్దని నిపుణులు సూచిస్తున్నారు. By Kusuma 20 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఉదయం లేచిన వెంటనే టీ తాగకపోతే కొందరికి అసలు రోజు కూడా గడవదు. అయితే టీ తాగుతూ కొందరు కొన్ని రకాల పదార్థాలను తీసుకుంటారు. ముఖ్యంగా అబ్బాయిలు అయితే టీతో సిగరెట్ తాగుతారు. ఉదయం, సాయంత్రం అనే తేడా లేకుండా టీతో కలిపి సిగరెట్ తాగుతుంటారు. అయితే ఇలా టీతో కలిపి సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్, టీ రెండు కలిపి తాగుతున్నట్లయితే ఆరోగ్యానికి కలిగే నష్టాలేంటో చూద్దాం. ఇది కూడా చూడండి: 12 ఏళ్లుగా కడుపులో కత్తెర.. తర్వాత ఏమైందంటే? క్యాన్సర్ ప్రమాదాలు ఎక్కువ కావడం టీ తాగుతూ సిగరెట్ కాల్చితే క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు పెరుగుతాయి. సిగరెట్‌లో ఉండు హానికర రసాయనాలు ఊపిరితిత్తులను నాశనం చేస్తాయి. సిగరెట్‌లో ఉండే రసాయనాలు టీతో కలవడం వల్ల గొంతు, నోరు, పేగు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చూడండి: ప్రజలను వణికిస్తున్న విచిత్రమైన జ్వరం.. ఆసుపత్రికి క్యూ జీర్ణ సమస్యలుటీలో ఉండే కెఫిన్ సిగరెట్‌తో కలిస్తే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. దీనివల్ల జీర్ణక్రియ సమస్యలు, అల్సర్, గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి వంటివి వస్తాయి. ఇది కూడా చూడండి: Bath: స్నానం చేసేప్పుడు మూత్రం వస్తే ఇలా మాత్రం చేయొద్దు గుండె సమస్యలుటీ తాగడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. సిగరెట్‌తో టీ తాగడం వల్ల రక్త నాళాలు కుంచించుకుపోయి అధిక రక్తపోటుకి దారితీస్తుంది. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదాలను పెంచుతుంది. ఎముకలు బలహీనంగా.. సిగరెట్లతో కలిపి టీ తాగడం వల్ల ఎముకలు బలహీనంగా మారుతాయి. దీంతో ఆర్థియోపోరోసిస్, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా టీతో కలిపి సిగరెట్ తాగకూడదు. ఇది కూడా చూడండి: ఘోర ప్రమాదం.. టెంపోను బస్సు ఢీకొనడంతో 8 మంది చిన్నారులు మృతి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #tea మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి