Milk: ఈ టైమ్‌లో తాగితే పాలు కూడా విషం అవుతాయి అమృతం కూడా ఎక్కువైతే విషం అవుతుందని కూడా విన్నాం. ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగడం కూడా శరీరానికి ప్రమాదకరమనేది ప్రస్తుత వార్త. ముందుగా ఏదైనా తిని ఆ తర్వాత పాలు తాగాలి.ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగితే ఇతర ఆహారాలలో లభించే పోషకాలను గ్రహించలేవట. By Vijaya Nimma 08 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update milk షేర్ చేయండి Milk: మనలో చాలా మందికి రోజూ పాలు తాగే అలవాటు ఉంటుంది. కొందరు ఉదయం పాలు తాగితే.. మరికొందరు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగుతారు. అయితే ఈ రెండింటికీ తేడా కూడా ఉంది. సాయంత్రం లేదా రాత్రి పాలు తాగే వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అయితే రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాలు తాగడానికి ఇష్టపడే వారు తరచుగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఎందుకంటే ఖాళీ కడుపుతో పాలు తాగకూడదని అంటున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు పాలు తాగడం వల్ల చాలా మందికి జీర్ణవ్యవస్థ సమస్యలు వస్తాయి. ఏ సమయంలోనైనా పాలు తాగాలి: ఎందుకంటే మనం తీసుకున్న ఇతర ఆహార పదార్థాలతో పాటు పాలలోని కంటెంట్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఇది సాధారణంగా ఉబ్బరం, గ్యాస్ట్రిక్ లేదా డయేరియాకు కారణమవుతుంది. కాబట్టి ఏదైనా తిని ఆ తర్వాత పాలు తాగడం మంచిది. ఖాళీ కడుపుతో పాలు తాగడం వల్ల కలిగే మరో తీవ్రమైన దుష్ప్రభావం రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. ఎందుకంటే పాలలో లాక్టోస్ అనే తీపి పదార్థం ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. కాబట్టి రోజులో ఏ సమయంలోనైనా పాలు తాగడం అలవాటు చేసుకోవాలి. శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు.. ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగడంతో ఇతర ఆహారాలలో లభించే పోషకాలను గ్రహించలేవు. ఎందుకంటే పాలలో ప్రొటీన్లు, కాల్షియం ఉంటాయి. ఇది మన ఆహారంలో లభించే ఐరన్ మొదలైన పోషకాలను మన శరీరం గ్రహించకుండా సహజంగా నిరోధిస్తుంది. శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాలు తాగకూడదని నిపుణులు అంటున్నారు. అలాగే రోజూ ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగితే గ్యాస్ట్రిక్, గుండెల్లో మంటతో పాటు ఎసిడిటీ కూడా పెరుగుతుందని చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: పడుకునే ముందు ఇలా చేస్తే బాగా నిద్రపడుతుంది #milk మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి