Kiwi: బీపీ, షుగర్ తగ్గాలంటే ఉదయం ఈ పండ్ల రసం తాగండి షుగర్, అధిక బీపీ ఉంటే కివీ జ్యూస్ తాగడం మంచిది. కివీ రసంలో ఉంటే మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. రోగ నిరోధకశక్తి పెరగాలన్న, వివిధ రకాల ఇన్ఫెక్షన్ల, బరువు తగ్గాలనుకుంటే, మలబద్ధకం సమస్య తగ్గాలంటే కివీ జ్యూస్ తీసుకోవాలి. By Vijaya Nimma 25 Sep 2024 in లైఫ్ స్టైల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Kiwi: ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి పోషకాలు, విటమిన్లు అవసరం. అందుకే పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తినాలని నిపుణులు చెబుతుంటారు. రుచి కొద్దిగా పుల్లగా, తీపిగా ఉంటుంది. కివీ రసంలో విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలేట్, పొటాషియం ఉంటాయి. అందుకే దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి త్వరగా పెరుగుతుంది. అదే సమయంలో ఇది అనేక ఇతర వ్యాధుల నుండి రక్షిస్తుంది. కివీ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని ఇవి పెంచుతాయి. ఆరోగ్యానికి కివీ పండు ఎంతో మేలు చేస్తుంది. కివీ ప్రయోజనాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం. రక్తపోటుకు బెస్ట్: అధిక బీపీ ఉంటే కివీ జ్యూస్ తాగడం మంచిది. కివీ రసంలో మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. జీర్ణ వ్యవస్థ కోసం: కివీ జ్యూస్ జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. కడుపు సమస్యలు ఉంటే కివీ జ్యూస్ తీసుకోవాలి. ఇందులోని పోషకాలు మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జీర్ణవ్యవస్థను బలపరుస్తాయి. కివీ ఫ్రూట్ జ్యూస్‌ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల స్థూలకాయాన్ని నివారించవచ్చు. స్థూలకాయంతో బాధపడుతూ బరువు తగ్గాలనుకుంటే కివీ జ్యూస్ తాగండి. కివీ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ హైపర్‌టెన్సివ్ గుణాలు ఉన్నాయి. ఇవి ఊబకాయాన్ని అదుపులో ఉంచుతాయి. కంటి చూపు మెరుగు: కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కివీ జ్యూస్ తాగాలి. ఇది దృష్టిని పదునుగా చేస్తుంది. వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి కళ్లను కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. కివీ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థను పెంపొందించడంతో పాటు అనేక ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలపరుస్తుందని నిపుణులు అంటున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #kiwi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి