Diwali: బంధువులు మరణిస్తే దీపావళి జరుపుకోవచ్చా? హిందువుల ప్రత్యేక పండుగలలో దీపావళి ఒకటి. మతపరమైన దృక్కోణంలో దీపావళి రోజున కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ రోజు పండుగ జరుపుకోకూడదు. ఆ కుటుంబంలో అప్పుడే బిడ్డ పుట్టినా లేదా అదే రోజు కొత్త వధువు వచ్చినా మళ్లీ పండుగ చేసుకోవచ్చని చెబుతారు. By Vijaya Nimma 21 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Diwali షేర్ చేయండి Diwali: దీపావళి పండుగను ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య రోజున జరుపుకుంటారు. ఇది హిందువుల ప్రత్యేక పండుగ. దీపావళి అనేది వెలుగులు, సంతోషాల పండుగ. అయితే దీపావళి పండుగను ఏ పరిస్థితుల్లో జరుపుకోకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కుటుంబంలో ఎవరైనా చనిపోతే దీపావళి పండుగ జరుపుకోవచ్చా లేదా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. కాబట్టి మన మత గ్రంధాలలో పుట్టుక నుంచి మరణం వరకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. బిడ్డ పుట్టినా లేదా కొత్త వధువు వచ్చినా.. మతపరమైన దృక్కోణంలో దీపావళి రోజున కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ రోజు పండుగ జరుపుకోకూడదు. ఎందుకంటే ఈ సమయంలో పూజ చేయడం నిషేధం. సూతక్ కాలం 10 రోజుల నుంచి ఒక నెల వరకు ఉంటుంది. సూతకం పాటించేటప్పుడు కుటుంబం పండుగలు జరుపుకోకూడదు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు కలిసి ప్రార్థించాలి. దీపావళి రోజున మరణం సంభవిస్తే చాలా కుటుంబాలు ఈ పండుగను సంవత్సరాల తరబడి జరుపుకోరు. ఎందుకంటే పండుగ సమయంలో కుటుంబ సభ్యులు చనిపోతే ఆ పండుగ ఫలితం ఉండదని భావిస్తారు. కానీ ఆ కుటుంబంలో అప్పుడే బిడ్డ పుట్టినా లేదా అదే రోజు కొత్త వధువు వచ్చినా మళ్లీ పండుగ చేసుకోవచ్చని చెబుతారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ భరత్ మిస్సింగ్.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి! #diwali మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి