దసరా రోజున ఈ పని తప్పక చేయండి.. అంతా మీకు అదృష్టమే! విజయదశమి రోజున పాలపిట్టను చూడటం వల్ల అదృష్టం వరిస్తుందని ప్రజలు నమ్ముతారు. ఈ పండుగ రోజు పాలపిట్టను చూస్తే ధనం, సంతోషం, విజయం సిద్ధించడంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. By Kusuma 11 Oct 2024 | నవీకరించబడింది పై 12 Oct 2024 10:27 IST in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. శ్రీరాముడు, రావణాసురుడిపై విజయం సాధించినందుకు విజయదశమి జరుపుకుంటారని మన పురాణాలు చెబుతున్నాయి. రాముడు యుద్ధంలో విజయం సాధించినందుకు చాలా చోట్ల రావణాసురుడిని దిష్టి బొమ్మను దహనం చేస్తారు. దసరా రోజు భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకుంటే మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారు. అయితే దసరా రోజు పాలపిట్టను చూడటం పవిత్రంగా భావిస్తారు. అసలు ఈ రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారు? అసలు ఈ సంప్రదాయం ఎలా వచ్చింది? పూర్తి స్టోరీలో తెలుసుకుందాం. ఇది కూడా చూడండి: విశ్వం ట్విట్టర్ రివ్యూ.. గోపీచంద్ ఖాతాలో హిట్ పడినట్లేనా? పాలపిట్టను చూస్తే.. శ్రీరాముడు రావణుడిపై యుద్ధం చేయడానికి వెళ్లే ముందు పాలపిట్టను చూసి వెళ్లాడని.. అందుకే విజయం సాధించాడని పురాణాలు చెబుతున్నాయి. పండుగ రోజు పాలపిట్టను చూడటం వల్ల మనిషికి సంతోషం, అదృష్టం, డబ్బు, ధనధాన్యాలు లభిస్తాయని నమ్ముతారు. పాలపిట్టను చూడటం వల్ల మంచితనం, లాభాలు వస్తాయట. అలాగే శ్రీరాముడు రావణుడిని సంహరించిన తర్వాత బ్రాహ్మణుడిని చంపిన పాపం మోపుతారట. దీంతో పశ్చాత్తాపం కోసం లక్ష్మణుడితో కలిసి పరమేశ్వరుడిని పూజించాడు. అప్పుడు శివుడు సంతోషించి పాలపిట్ట రూపంలో దర్శనమిస్తాడు. అందుకే దసరా పండుగ రోజు పాలపిట్టను చూడటం మంచిగా భావిస్తారు. ఇది కూడా చూడండి: Dasara: దసరా రోజు జమ్మిచెట్టును పూజిస్తే కలిగే లాభాలు అలాగే అరణ్య వాసం ముగించుకుని పాండవులు ఆయుధాలు తీసుకుని వెళ్తున్నప్పుడు పాలపిట్ట ఎదురుపడిందట. ఆ తర్వాత కౌరవులతో జరిగిన యుద్ధంలో పాండవులు విజయం సాధించారు. అందుకే పాల పిట్ట ఎదురుపడితే అన్నింటా విజయం లభిస్తుందని నమ్ముతారు. విజయానికి ప్రతీకగా పాలపిట్టను చూస్తారని.. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇది కూడా చూడండి: Vijayadashami Festival: దసరా రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులు #dasara మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి