Curry tree: ఖాళీ కడుపుతో ఈ ఆకును తింటే.. సమస్యలన్నీ క్లియర్

ఖాళీ కడుపుతో రోజూ ఉదయం కరివేపాకు తినడం వల్ల దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి చెందుతారు. అలాగే మలబద్ధకం, జీర్ణ సమస్యలు, అజీర్ణం వంటి సమస్యలు క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

New Update
cURRY LEAVES

cURRY LEAVES Photograph: (cURRY LEAVES)

కరివేపాకును ఉదయం పూట నమిలితే ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉంటాయి. ఇందులోని పోషకాలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేస్తుంది. కేవలం 15 రోజుల పాటు ఉదయం పరగడుపున కరివేపాకును నమిలితే దీర్ఘకాలిక సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ సైన్యంపై తాబన్ల దాడి..16 మంది మృతి

చెడు కొలెస్ట్రాల్..

కూరల్లో ఎక్కువగా వాడే కరివేపాకు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. ఖాళీ కడుపుతో ఉదయం పూట ఈ ఆకులను నమిలితే బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతాయి. అలాగే జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు క్లియర్ అవుతాయని నిపుణలు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: TS: పోలీసులు పర్మిషన్ ఇచ్చారో లేదో ఆయనకూ తెలుసు–మంత్రి శ్రీధర్ బాబు

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మొటిమలు, మచ్చలు లేకుండా ఉంచుతుంది. విటమిన్లు, మినరల్స్ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు అనేక వ్యాధులు రాకుండా సాయపడతాయి. అలాగే ఈజీగా బరువు తగ్గుడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇవి డయాబెటిస్ ఉన్నవారి ఆరోగ్యానికి మంచిది.

ఇది కూడా చూడండి: పీఎఫ్ నిధుల మోసం కేసులో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Androgen: పురుషులలో ఆండ్రోజెన్ లోపం ఉంటే ఏమి జరుగుతుంది?

పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు లైంగిక కోరిక తగ్గిపోవడం, అంగస్తంభన సమస్యలు, అలసట, డిప్రెషన్, శరీర బలహీనత వంటి సమస్యలు ఉంటాయి. ఈ పరిస్థితిని ఆండ్రోజెన్ లోపం అంటారు. ఆండ్రోజెన్ లోపాన్ని నిర్ధారించడానికి పూర్తిస్థాయి వైద్య తీసుకోవాలి.

New Update

Androgen: పురుషుల్లో టెస్టోస్టెరాన్ అనే ముఖ్యమైన లైంగిక హార్మోన్ స్థాయిలు తగ్గిపోవడం వలన వారి లైంగిక జీవితంతో పాటు మొత్తం శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితిని ఆండ్రోజెన్ లోపం అంటారు. టెస్టోస్టెరాన్ అనేది వృద్ధి, పునరుత్పత్తి, శరీర కండరాలు, ఎముకల బలము, లైంగిక కోరికకు అవసరమైన కీలక హార్మోన్. ఇది వృషణాలలో ఉత్పత్తి అవుతూ మెదడులోని హైపోథాలమస్, పిట్యూటరీ గ్రంథి ఆధీనంలో ఉంటుంది. పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు లైంగిక కోరిక తగ్గిపోవడం, అంగస్తంభన సమస్యలు, ఉత్సాహం లేకపోవడం, అలసట, డిప్రెషన్, శరీర బలహీనత వంటి సమస్యలు మొదలవుతాయి. 

రక్త నమూనాలో టెస్టోస్టెరాన్..

ముఖ్యంగా ముఖ జుట్టు, శరీర జుట్టు తగ్గిపోవడం, ఎముకలు బలహీనపడటం వంటి లక్షణాలు కూడా కనబడవచ్చు. ఇవి చాలా సందర్భాల్లో ఇతర వ్యాధుల లక్షణాలతో పోలి ఉండటంవల్ల నిర్ధిష్టంగా గుర్తించడంలో కష్టం తలెత్తవచ్చు. ఆండ్రోజెన్ లోపాన్ని నిర్ధారించడానికి ముందుగా పూర్తిస్థాయి వైద్య చరిత్ర తీసుకోవడం అవసరం. ఇందులో రోగి లైంగిక జీవితపు వివరాలు, మునుపటి వైద్య సమస్యలు, మందుల వాడకం, వృత్తి, అలవాట్లను కూడా పరిశీలిస్తారు. శారీరక పరీక్షలో వృషణాల పరిమాణం, రొమ్ము పెరుగుదల వంటి అంశాలను పరిశీలిస్తారు. రక్త పరీక్షలు ముఖ్యమైనవి. ఖాళీ కడుపుతో తీసే రక్త నమూనాలో టెస్టోస్టెరాన్ స్థాయిలను అంచనా వేయడం ద్వారా ఈ లోపం ఉందో లేదో తెలుసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: కాఫీ పౌడర్‌తో అవాంఛిత రోమాలు తొలగించవచ్చా?

పిట్యూటరీ గ్రంథి హార్మోన్లు, లూఠినైజింగ్ హార్మోన్ స్థాయిలను కూడా పరీక్షిస్తారు. టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉండటానికి మరొక కారణం ఉన్నదా లేదా తెలుసుకోవడానికి ఐరన్ పరీక్ష, జన్యు పరీక్షలు లేదా మెదడుకు సంబంధించిన MRI స్కాన్ అవసరం కావొచ్చు. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు వీర్య విశ్లేషణ కూడా నిర్వహిస్తారు. ఈ పరీక్షల ద్వారా సమస్యను సమగ్రంగా అర్థం చేసుకొని, టెస్టోస్టెరాన్ భర్తీ చికిత్సను ప్రారంభించడం ద్వారా పురుషులు తిరిగి ఆరోగ్యకరమైన లైంగిక జీవనాన్ని పొందగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: మీ భాగస్వామికి లైంగిక ఆసక్తి లేదని తెలిపే సంకేతాలు ఇవే

( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | men)

Advertisment
Advertisment
Advertisment